ETV Bharat / international

రష్యా అధ్యక్షుడితో అజిత్​ ఢోబాల్​ భేటి.. కీలక విషయాలపై చర్చ

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ రష్యా అధ్యక్షుడు పుతిన్​తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు సంబంధించి కీలకాంశాలపై చర్చించుకున్నారు. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబారి కార్యాలయం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది.

nsa ajit doval meets russian president putin

author img

By

Published : Feb 9, 2023, 7:45 PM IST

భారత్​-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించేందుకు కృషి చేయాలని ఇరు దేశాలు తీర్మానించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ ఈమేరకు గురువారం చర్చలు జరిపినట్లు రష్యాలోని భారత రాయబారి కార్యాలయం వెల్లడించింది. అఫ్గానిస్థాన్​పై రష్యా నిర్వహించిన ఐదో జాతీయ భద్రతా మండల కార్యాదర్శుల సమావేశం కోసం భారత జాతీయ సలహాదారు అజిత్ ఢోబాల్​ గురువారం మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్​ను ఆయన కలుసుకున్నారు. ఆ సమయంలో ఇరుదేశాలకు సంబంధించి ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించుకున్నట్లు మాస్కోలోని భారత రాయబారి కార్యాయలం ట్విట్టర్​ ద్వారా తెలిపింది.

అఫ్గానిస్థాన్​ను ఏ దేశం కూడా ఉగ్రవాద ఎగుమతి దేశంగా ఉపయోగించుకోకూడదని అజిత్​ ఢోబాల్​ అన్నారు. అఫ్గాన్​లో ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అఫ్గాన్​ క్షిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందని.. దీనికి అన్ని సభ్యదేశాల సహకారం అవసరమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అఫ్గాన్​ ప్రజలకు అవసరమైన సమయంలో సహకారం అందిస్తుందని అజిత్​ ఢోబాల్​ హామీ ఇచ్చారు. అఫ్గాన్​లోని ప్రజల పరిస్థితి రోజురోజుగా దిగజారుతోందని.. కొంచెం కూడా మెరుగు పడటం లేదని పుతిన్​ తెలిపారు. రష్యా నిర్వహించిన ఈ సమావేశానికి భారత్‌తో పాటు ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, చైనా, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.