ETV Bharat / international

నేర విచారణకు మస్తిష్క తరంగాల విశ్లేషణ.. త్వరలోనే సరికొత్త సాంకేతికత! - పి300 సాంకేతికత

నేరాలను రుజువు చేయాల్సి వచ్చినప్పుడు భౌతిక ఆధారాలేవీ దొరకని పరిస్థితుల్లో ప్రత్యక్ష సాక్షులపైనే పోలీసులు, కోర్టులు ఆధారపడాల్సి వస్తుంటుంది. ఒకవేళ వారు అబద్ధం చెప్పినా, పొరబడినా అమాయకుల జీవితాలు బలవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దర్యాప్తు అధికారులకు దోహదపడేలా, నిర్దోషులకు వరంగా మారేలా.. 'సంక్లిష్ట విచారణ ప్రొటోకాల్‌ (సీటీపీ)' పేరుతో సరికొత్త సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సాంకేతిక ఏంటో ఓ సారి తెలుసుకుందామా..

ctp technology
సీటీపీ
author img

By

Published : Jul 2, 2022, 8:26 AM IST

మూడు హత్యలకు సంబంధించిన ఓ కేసులో అమెరికాకు చెందిన కెవిన్‌ స్టిక్‌లాండ్‌ 1978లో దోషిగా నిర్ధారణ అయ్యారు. అప్పటి నుంచి నాలుగు దశాబ్దాలకు పైగా జైల్లోనే గడిపిన ఆయన- గత ఏడాది నవంబరులో నిర్దోషిగా బయటికొచ్చారు. దోషి నిర్దోషిగా మారడమేంటని అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే అసలు కథ ఉంది! దర్యాప్తును వేగంగా ముగించే ఉద్దేశంతో పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో.. కెవినే హంతకుడని ప్రత్యక్ష సాక్షి తప్పుగా వాంగ్మూలమిచ్చారు. తన పని పూర్తయిందనిపించుకొని పక్కకు తప్పుకొన్నారు. కానీ తప్పుడు వాంగ్మూలం కారణంగా కెవిన్‌ దాదాపు 42 ఏళ్లు కారాగారానికి పరిమితమయ్యారు. ఆయనొక్కరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. భౌతిక ఆధారాలేవీ దొరకని పరిస్థితుల్లో ప్రత్యక్ష సాక్షులపైనే పోలీసులు, కోర్టులు ఆధారపడాల్సి వస్తుంటుంది. ఒకవేళ వారు అబద్ధం చెప్పినా, పొరబడినా అమాయకుల జీవితాలు బలవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దర్యాప్తు అధికారులకు దోహదపడేలా, నిర్దోషులకు వరంగా మారేలా.. 'సంక్లిష్ట విచారణ ప్రొటోకాల్‌ (సీటీపీ)' పేరుతో సరికొత్త సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'పి300' అనే ఎలక్ట్రికల్‌ మెదడు తరంగాన్ని విశ్లేషించడం ద్వారా సీటీపీ పనిచేస్తుంది. ఇందులో భాగంగా వ్యక్తుల తలకు ఎలక్ట్రోడ్‌లను అమరుస్తారు. వారిని నిర్దేశిత ఉద్దీపనలకు గురిచేసి.. ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రామ్‌ ద్వారా ఫలితాలను విశ్లేషించొచ్చు. నేరం జరిగిన ప్రదేశంలో తాను చూసిన వ్యక్తులు, ఆయుధాల తాలూకు జ్ఞాపకాలు ప్రత్యక్ష సాక్షి మెదడులో నిజంగా ఉన్నాయా.. వాటి గురించి సత్యమే చెబుతున్నారా లేదా అనే విషయాలను ఈ విధానంలో తెలుసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. అయితే సీటీపీ వినియోగంతో కొన్నిసార్లు తీవ్ర నష్టం చేకూరే ముప్పూ లేకపోలేదని పలువురు హెచ్చరిస్తున్నారు. అనుమానితుల ఫొటోలు, వీడియోలను ప్రత్యక్ష సాక్షులు ఘటనా స్థలంలో కాకుండా టీవీలు, సామాజిక మాధ్యమాల్లో చూసి ఉంటే.. వాటి తాలూకు జ్ఞాపకాలూ మెదడు పొరల్లో ఉండిపోతాయని పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లోనూ ప్రత్యక్ష సాక్షుల తప్పుడు వాంగ్మూలం సరైనదిగానే కనిపించే అవకాశాలుంటాయని హితవు పలికారు. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన దివంగత పీటర్‌ రోసెన్‌ఫెల్డ్‌ అభివృద్ధి చేసిన ఈ సీటీపీ సాంకేతికతను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

ఇవీ చదవండి: 48 ఏళ్ల క్రితం నాటి బిల్​గేట్స్ రెజ్యూమ్​ వైరల్​

ఉక్రెయిన్​పై రష్యా క్షిపణి దాడి- 18 మంది బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.