ETV Bharat / international

పార్లమెంటులో పోర్న్​ షో.. అధికార పక్ష ఎంపీ రాజీనామా - britain parliament news

పార్లమెంటులో నీలి చిత్రాలు చూసి, తీవ్ర విమర్శలపాలైన బ్రిటన్ అధికార పార్టీ ఎంపీ నీల్​ పారిష్​.. పదవికి రాజీనామా చేశారు. ఓ ట్రాక్టర్ వెబ్​సైట్​ చూద్దామనుకుంటే అదే పేరుతో ఉన్న పోర్న్ సైట్ ఓపెన్ అయిందని, కాసేపు చూశానని ఆయన అంగీకరించారు.

Neil Parish resigns
పార్లమెంటులో పోర్న్​ షో.. అధికార పక్ష ఎంపీ రాజీనామా
author img

By

Published : May 1, 2022, 10:47 AM IST

బ్రిటన్ పార్లమెంటు దిగువ సభలో కూర్చుని, మొబైల్​ ఫోన్​లో నీలి చిత్రాలు చూసిన అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు నీల్​ పారిష్​(65) తన పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ ఎంపీల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో శనివారం రాజీనామాపై ప్రకటన చేశారు నీల్. సభలో పోర్న్ చూశానని అంగీకరించారు. బ్రిటన్ పార్లమెంటు పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్​గానూ ఉన్నారు నీల్.

"అవి పిచ్చి క్షణాలు. నేను ఓ ట్రాక్టర్ వెబ్​సైట్​ కోసం వెతుకుతున్నా. అప్పుడు అలాంటి పేరుతోనే ఉన్న ఓ పోర్న్ వెబ్​సైట్​ ఓపెన్ అయింది. కాసేపు చూశా. తర్వాత రెండోసారి అదే సైట్ ఓపెన్ చేసి చూడడం నేను చేసిన అతి పెద్ద నేరం. రెండోసారి కావాలనే చూశా." అని తన తప్పును అంగీకరించారు నీల్.

Neil Parish resigns
పార్లమెంటులో పోర్న్​ షో.. అధికార పక్ష ఎంపీ రాజీనామా

నీల్.. దాదాపు పదేళ్లుగా అధికార పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆయన సభలోనే కూర్చుని పోర్న్ చూశారన్న వార్తలు పెను దుమారం రేపాయి. మహిళా సభ్యుల నుంచి ఫిర్యాదులు పోటెత్తాయి. లాక్​డౌన్​ వేళ ప్రధాని బోరిస్​ జాన్సన్ పార్టీలకు హాజరవడంపై ఇప్పటికే వ్యతిరేకత ఎదుర్కొంటూ.. ఈనెల 5న జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార పక్షం.. నీల్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ఫలితంగా ఆయన రాజీనామా చేయక తప్పలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.