ETV Bharat / international

పోలీసుల్ని పరుగులు పెట్టించిన పిల్ల కోతి, ఏం చేసిందంటే - Monkey Calls 911

Monkey Calls 911 సాధారణంగా పోలీసులను దొంగలు దొరకకుండా ముప్పతిప్పలు పెడుతుంటారు. ఆ సమయంలో పోలీసులు పడే కష్టాలు అంతా ఇంతా కాదు. కానీ ఇక్కడ మాత్రం పోలీసులను ఓ కోతి పరుగులు పెట్టించింది. అదెక్కడంటే

Monkey Calls 911 From A Cellphone Cops Rush To US Zoo

author img

By

Published : Aug 20, 2022, 11:05 AM IST

Updated : Aug 20, 2022, 2:06 PM IST

Monkey Calls 911: అమెరికా కాలిఫోర్నియాలోని పోలీసులకు జూ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కానీ ఎవరూ మాట్లాడకుండానే ఆ కాల్ డిస్​కనెక్ట్​ అయింది. కాల్​ ముగిసిన వెంటనే ఏమైందో అనే కంగారులో పోలీసులంతా అక్కడికి బయల్దేరారు. ఆ ఫోన్​కాల్​ను ట్రేస్​ చేయగా ఆ చుట్టుపక్కల ఎవరికీ ప్రమాదం లేదన్న సమాచారం తెలిసింది. తీరా చూస్తే కాల్​ చేసింది మరెవరో కాదు అదే జూకు చెందిన రౌట్​ అనే ఒక కొంటె కోతిపిల్ల. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.

అసలేం జరిగిందంటే: జూ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం జూ లోని 40 ఎకరాల గోల్ఫ్​ కోర్టులో ఉన్న కార్ట్​లో ఓ ఫోన్​ ఉంది. అది కోతి పిల్ల చేతికి దొరకడంతో అది ఈ అల్లరి పని చేసిందని తేలింది. దీంతో మొదట ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆ తర్వాత కాసేపు నవ్వుకున్నారు.
ఈ సంఘటనను నెటిజన్లతో షేర్​ చేసుకున్నారు పోలీసులు. ఈ పోస్ట్​ను చూసిన నెటిజన్లు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన కోతి చేసిన పనికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

పోలీసుల్ని పరుగులు పెట్టించిన పిల్ల కోతి

ఇదీ చదవండి: రష్దీపై దాడికి వారే కారణం, ఎట్టకేలకు నోరు విప్పిన ఇరాన్

అగ్రరాజ్యం తగ్గేదేలే, తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం

Last Updated : Aug 20, 2022, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.