ETV Bharat / international

బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరో.. లిజ్​ ట్రస్​కు పెరిగిన మద్దతు.. మరి రిషి సునాక్​? - రిషి సునాక్‌

Liz truss future pm: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42), విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ (46) బరిలో మిగిలారు. ఇద్దరిలో ఎవరు ప్రధాని అవుతారన్నది కన్జర్వేటివ్‌ పార్లమెంటరీ పార్టీతోపాటు ఆ పార్టీ సభ్యుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే పార్టీ సభ్యుల్లో అత్యధికులు ట్రస్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. 'యూగవ్' అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.

britain pm election news
బ్రిటన్ ఎన్నికలు
author img

By

Published : Jul 23, 2022, 8:41 AM IST

Liz truss future pm: బ్రిటన్‌ ప్రధాని పదవికి పాలక కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుల మధ్య జరిగిన పోటీలో చివరి రౌండు వచ్చేసరికి భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42), విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ (46) బరిలో మిగిలారు. ఇద్దరిలో ఎవరు ప్రధాని అవుతారన్నది కన్జర్వేటివ్‌ పార్లమెంటరీ పార్టీతోపాటు ఆ పార్టీ సభ్యుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. పార్లమెంటరీ పార్టీలో 5 విడతలుగా జరిగిన ఓటింగ్‌లో 137 మంది ఎంపీలు సునాక్‌కు అనుకూలంగా ఓటు వేయగా ట్రస్‌కు 113 మంది మాత్రమే ఓటు వేశారు. అయితే పార్టీ సభ్యుల్లో అత్యధికులు ట్రస్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంటర్నెట్‌ ఆధారిత బ్రిటిష్‌ అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధన సంస్థ 'యూగవ్‌' ఈమేరకు సర్వే చేసింది. ఈమేరకు బుధ, గురువారాల్లో 730 మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులను సర్వే చేయగా వారిలో 62% మంది ట్రస్‌ను బలపరిచారు. సునాక్‌కు 38% మంది మద్దతిచ్చారు. 2019లో కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వం కోసం జరిగిన ఎన్నికల్లో 1,60,000 మంది సభ్యులు ఓటువేశారు. ప్రస్తుతం వారి సంఖ్య ఇంకాస్త పెరిగి ఉంటుందని సమాచారం. సభ్యుల్లో స్త్రీ-పురుషులు, అన్ని వయోవర్గాలవారు, బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసినవారిలో అత్యధికులు ట్రస్‌నే సమర్థించారు. చిత్రంగా 2016లో ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి బ్రిటన్‌ వేరుపడాలని (బ్రెగ్జిట్‌) సునాక్‌ ప్రచారం చేయగా, ఈయూలోనే ఉండాలని ట్రస్‌ వాదించారు. కాగా ఆగష్టు 4 నుంచి సెప్టెంబరు మొదటివారం వరకు 12 విడతలుగా జరిగే ఓటింగ్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు ట్రస్‌, సునాక్‌లలో ఎవరు ప్రధాని అవుతారో నిర్ణయిస్తారు. ఈలోగా పార్టీ సభ్యుల ఆదరాభిమానాలను చూరగొనడానికి అభ్యర్థులిద్దరూ ముమ్మరంగా ప్రచారం చేపట్టబోతున్నారు.

ఇవీ చదవండి: లంకలో దయనీయ పరిస్థితులు.. క్యూలైన్లలోనే కుప్పకూలుతున్న ప్రజలు!

బ్యాంకులకు వచ్చే జనంపై యుద్ధ ట్యాంకులతో గురి! చైనాలో అంతే!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.