ETV Bharat / international

Israel Palestine War : ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు.. 5వేల క్షిపణుల ప్రయోగం.. నలుగురు మృతి - ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం

Israel Palestine War : ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. శనివారం ఉదయం గాజా స్ట్రిప్ నుంచి వేలకొద్దీ క్షిపణులు.. ఇజ్రాయెల్​పైకి దూసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైతం ప్రతిదాడులకు దిగింది.

Israel Palestine War
Israel Palestine War
author img

By PTI

Published : Oct 7, 2023, 11:48 AM IST

Updated : Oct 7, 2023, 1:19 PM IST

Israel Palestine War : ఇజ్రాయెల్‌- పాలస్తీనాల మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. గాజా స్ట్రిప్‌ నుంచి తమ భూభాగంపై క్షిపణి దాడులు జరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ స్టేట్‌ ఆఫ్‌ వార్ ప్రకటించింది. శనివారం ఉదయం ఆరున్నర ప్రాంతంలో గాజా స్ట్రిప్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ సైన్యం.. దక్షిణ, మధ్య ప్రాంతాల్లో దాదాపు గంటకుపైగా హెచ్చరిక సైరన్లు మోగించినట్లు సమాచారం. బాంబు షెల్టర్ల సమీపంలోనే ఉండాలని ప్రజలను ఇజ్రాయెల్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. గాజా స్ట్రిప్‌ నుంచి అనేక మంది ఉగ్రవాదులు చొరబడినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన రాకెట్‌ దాడిలో ఓ వృద్ధురాలు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

  • #WATCH | Gaza: Rocket barrages launched towards Israel from Gaza

    The Palestinian Islamist movement Hamas launched an attack on Israel in a surprise assault that combined gunmen crossing the border with a heavy barrage of rockets fired from the Gaza Strip, reports Reuters

    (Video… pic.twitter.com/pk8q2Byvl1

    — ANI (@ANI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందు, ఇజ్రాయెల్​పై సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్లు హమాస్ మిలిటరీ గ్రూప్ వెల్లడించింది. శనివారం ఉదయం 5వేలకు పైగా రాకెట్లు ఇజ్రాయెల్​పైకి ప్రయోగించినట్లు తెలిపింది. 'ఆపరేషన్ అల్-అక్సా స్టోర్మ్' పేరుతో ఈ సైనిక చర్య చేపడుతున్నట్లు వెల్లడించింది. 'ఇప్పటివరకు జరిగింది చాలు. పాలస్తీనా ప్రజలందరూ ఇజ్రాయెల్​ను ఎదుర్కోవాలి' అని సైనిక గ్రూపు నాయకుడు మహమ్మద్ దెయిఫ్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ చేసిన అనేక హత్యాయత్నాలను ఎదుర్కొన్న దెయిఫ్ అత్యంత అరుదుగా బహిరంగ ప్రకటనలు చేస్తుంటారు.

Israel Palestine War
క్షిపణి దాడుల్లో వాహనాలు ధ్వంసం
Israel Palestine War
కార్లకు అంటుకున్న మంటలు ఆర్పుతున్న సిబ్బంది

ఒకరు మృతి..
కాగా, హమాస్ రాకెట్ల దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయని సీఎన్ఎన్ తెలిపింది. మృతుల్లో 60 ఏళ్ల వృద్ధురాలు సైతం ఉందని విపత్తు, సహాయక సేవల ప్రతినిధి మాగెన్ డేవిడ్ ఆడమ్ తెలిపారు. 16 మందికి గాయాలయ్యాయని ఆయన వెల్లడించారు.

Israel Palestine War
దూసుకెళ్తున్న రాకెట్లు
Israel Palestine War
గగనతలంలో రాకెట్లు

గాజా నుంచి చొరబాట్లు
మరోవైపు, గాజా నుంచి భారీ సంఖ్యలో చొరబాట్లు గుర్తించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలోని కీలక లక్ష్యాలపై దాడులు జరుపుతున్నట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. "ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) యుద్ధానికి సన్నద్ధతను ప్రకటించాయి. చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవీ.. కార్యాచరణ ప్రణాళికను ఆమోదిస్తున్నారు. ఈ దాడుల వెనక ఉన్న హమాస్.. ఫలితాన్ని అనుభవించక తప్పదు. దాడులకు బాధ్యత వహించాల్సిందే" అని ఇజ్రాయెల్ ఆర్మీ స్పష్టం చేసింది. తమపై హమాస్ యుద్ధం ప్రకటించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవావ్ గాలంట్ పేర్కొన్నారు. ఇది ఘోరమైన తప్పిదమని అన్నారు. ఇందులో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.

Israel Palestine War
దాడుల వల్ల చెలరేగుతున్న మంటలు
Israel Palestine War
క్షిపణి దాడులు

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడిలో 10 మంది మృతి.. ఉక్రెయిన్​లో మరో 11 మంది..

గాజాపై బాంబుల వర్షం తీవ్రం.. ఇద్దరు పీజేఐ నేతలు హతం.. 28కి చేరిన మృతులు

Last Updated : Oct 7, 2023, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.