ETV Bharat / international

ఫ్రెండ్​ కార్​లో షికారుకు వెళ్లడమే అతడి పొరపాటు.. దారుణంగా కాల్చి... - indian origin man died in america

సరదాగా షికారు చేద్దామని తన స్నేహితుడి దగ్గర నుంచి కారు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. ఆ తర్వాత తన ఇంటి ముందు కారు పార్క్​ చేసి లోపల కూర్చున్నాడు. అంతలోనే.. ఓ దుండుగుడు వచ్చి కాల్చి చంపి పారిపోయాడు. ఇదంతా ఏదో సినిమాలో జరిగినట్టు అనిపిస్తుంటుంది.. కానీ, ఇప్పుడు ఇలాంటి ఘటనే న్యూయార్క్​లో జరిగింది.

indian-origin-man-gunned-down-wh
indian-origin-man-gunned-down-wh
author img

By

Published : Jun 27, 2022, 1:29 PM IST

న్యూయార్క్​లో విషాద ఘటన జరిగింది. ఇంటి సమీపంలో కారులో కూర్చున్న భారతి సంతతికి చెందిన ఓ వ్యక్తిని దుండుగుడు కాల్చి చంపాడు. బాధితుడ్ని సత్నామ్​సింగ్​గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపడతున్నామని తెలిపారు.

ఇదీ జరిగింది.. న్యూయార్క్​ రిచ్​మండ్​ హిల్​లో నివాసం ఉంటున్న భారత సంతతి వ్యక్తి సత్నామ్​సింగ్​.. శనివారం కారులో షికారు చేద్దామనుకున్నాడు. తన దగ్గర కారు లేకపోవడం వల్ల స్నేహితుడి దగ్గర అడిగి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత.. తన ఇంటి ఆవరణలో కారు పార్క్​ చేసి అందులో కూర్చున్నాడు. అంతలోనే మృత్యువు ఓ దుండగుడి రూపంలో వచ్చింది. కారులో కూర్చున్న సత్నామ్​ సింగ్​ను దుండగుడు కాల్చి చంపి పారిపోయాడు. కాసేపటికి గమనించిన స్థానికులు.. బాధితుడ్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మరణించినట్లు నిర్ధరించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

అయితే దుండుగుడి లక్ష్యం మృతి చెందిన వ్యక్తి కాదని, కారు యజమాని అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, పోలీసుల తీరుపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్​ నెలలో రిచ్​మండ్​ హిల్​లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సిక్కుల తలపాగాలను తీసేసి మరీ కొందరు దుండగులు దాడి చేశారు. ఆ ఘటనలకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి: బుల్​ఫైట్​లో కుప్పకూలిన స్టాండ్​.. నలుగురు మృతి.. వందల మందికి గాయాలు

పరీక్షలు అయిపోయాయని విద్యార్థుల పార్టీ.. 21 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.