ETV Bharat / international

భారత్ కోరుకునే రక్షణ భాగస్వామిగా ఉంటాం: అమెరికా - 2+2 చర్చలు

India US 2+2: భారత్​కు కీలకమైన రక్షణ భాగస్వామిగా ఉండేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య జరిగిన 2+2 చర్చల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం.. ద్వైపాక్షిక స్థాయిని దాటిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోళ్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్​కు ఇరుదేశాలు వార్నింగ్ ఇచ్చాయి.

India US dialogue in Washington
India US dialogue in Washington
author img

By

Published : Apr 12, 2022, 10:19 AM IST

Updated : Apr 12, 2022, 12:23 PM IST

India US news: ఉక్రెయిన్​పై రష్యా దురాక్రమణ సాగిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత్, అమెరికా.. రక్షణ, విదేశాంగ మంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులతో భేటీ అయిన భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్... ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలతో పాటు ప్రపంచ పరిణామాలపై సమాలోచనలు జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. భారత్​తో సంబంధాలు అమెరికాకు చాలా ముఖ్యమని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు.

India US dialogue in Washington
సంయుక్త మీడియా సమావేశంలో నలుగురు మంత్రులు

"భారత్- రష్యా మధ్య దీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయి. భారత్​తో సంబంధాల విషయంలో అమెరికా తటస్థంగా ఉన్న సమయంలోనూ రష్యా- ఇండియా మధ్య సంబంధాలు కొనసాగాయి. కానీ, కాలం మారిపోయింది. ఇప్పుడు అమెరికా భారత్​కు మెరుగైన భాగస్వామిగా, భారత్ కోరుకునే రక్షణ భాగస్వామిగా ఉండగలుగుతోంది.. ఇకపైనా ఉండేందుకు సిద్ధంగా ఉంది."
-ఆంటోనీ బ్లింకెన్

India US dialogue in Washington: ఈ సందర్భంగా రష్యాతో భారీ ఆయుధ లావాదేవీలు జరపొద్దని అన్ని దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్​లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. రష్యా- భారత్ మధ్య ఎస్-400 డీల్​పై స్పందించిన ఆయన.. కాట్సా చట్టం ప్రకారం ఆంక్షలు విధించే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. మరోవైపు, ఉక్రెయిన్​కు భారత్ చేస్తున్న సాయం గురించి ప్రస్తావించారు బ్లింకెన్. ప్రపంచ మార్కెట్​కు మరిన్ని ఆహార పదార్థాలు అందించడం, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్​కు సాయం అందించే విషయంలో ఇరుదేశాలు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

India US dialogue in Washington
సంయుక్త సమావేశంలో నేతలు

అమెరికా- భారత్ సంబంధాలు ద్వైపాక్షికానికి మించి...: అమెరికా మంత్రులతో ఉక్రెయిన్​లో యుద్ధం, అఫ్గాన్ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులతో పాటు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో భారత్-అమెరికా మధ్య సహకారం ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా తెలిసిందని అన్నారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం.. ద్వైపాక్షిక స్థాయిని దాటిందని చెప్పారు. అమెరికా- భారత్ సహకరించుకోని రంగంమంటూ లేదని తెలిపారు. ఈ సందర్భంగా రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంపై సంయుక్త మీడియా సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నించగా.. విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టిగా బదులిచ్చారు. భారత్ దిగుమతి చేసుకునే చమురు చాలా తక్కువేనని స్పష్టం చేశారు.

India US dialogue in Washington
బ్లింకెన్​తో జైశంకర్

"యుద్ధం మొదలైనప్పటి నుంచి మా వైఖరి స్పష్టం చేస్తూనే ఉన్నాం. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్య పరిష్కారానికి పిలుపునిస్తున్నాం. మేం ఘర్షణకు వ్యతిరేకం. భారత్ ఇంధన కొనుగోళ్లపై మీరు ప్రశ్నిస్తే మీకు నేను చెప్పేది ఒక్కటే. మీరు ముందుగా ఐరోపాపై దృష్టిసారించాలి. మా ఇంధన అవసరాల కోసం మేం చమురు కొనుగోలు చేస్తున్నాం. గణాంకాలను పరిశీలిస్తే.. మేం నెల రోజుల పాటు కొనే ఇంధనం.. ఐరోపా దేశాలు ఒకరోజు మధ్యాహ్నానికి కొనే మొత్తానికి సమానం."
-జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

India US 2+2 dialogue: టార్గెట్ చైనా: భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఇండోపసిఫిక్ భద్రతకు కీలకమని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైనాకు పరోక్ష హెచ్చరికలు చేశారు. అంతర్జాతీయ వ్యవస్థను తన నిరంకుశ ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని అన్నారు. భారత్-అమెరికా మధ్య తొలి రక్షణ ఫ్రేమ్​వర్క్​ ఒప్పందం జరిగి రెండు దశాబ్దాలు గడుస్తున్న సందర్భంగా.. ఇరుదేశాల మధ్య బంధం ఇండో పసిఫిక్​కు మూలస్తంభంగా నిలుస్తుందని చెప్పారు. భారత్, అమెరికా సైన్యాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు.

హిందూమహాసముద్రంలో భారత్​ది కీలక పాత్ర అని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ అన్నారు. భారత్ పాటిస్తున్న విధానాల వల్ల ఇండో పసిఫిక్​లోనూ ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. భారత్, అమెరికా పెరుగుతున్న సహకారం.. ప్రపంచవ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడేందుకు అవసరమని పేర్కొన్నారు.

మానవహక్కుల అంశంపై...: మరోవైపు, భారత్​లో మానవహక్కుల ఉల్లంఘనపై కీలక వ్యాఖ్యలు చేశారు బ్లింకెన్. దేశంలో మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఆందోళకరమైన ఘటనలు కొన్ని తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయని అన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, జైలు అధికారులు.. ఇందుకు కారణమవుతున్నట్లు పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన బ్లింకెన్.. దీనిపై భారతదేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

పాకిస్థాన్​కు చురకలు: ఇదే సమావేశంలో పాకిస్థాన్​కు ఇరుదేశాలు హెచ్చరికలు చేశాయి. పాకిస్థాన్ అధీనంలో ఉన్న భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశాయి. ముంబయి దాడులు, పఠాన్​కోట్ దాడుల నిందితులపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి. పాకిస్థాన్ సమర్థవంతమైన చర్యలను సత్వరమే తీసుకోవాలని హితవు పలికాయి.

India US dialogue in Washington
మోదీ- బైడెన్ వర్చువల్ సమావేశం

2+2 చర్చలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షత వహించారు. ఇరువురూ వర్చువల్​గా భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న రాజ్​నాథ్, జైశంకర్.. బైడెన్​తో కలిసి సమావేశయ్యారు.

ఇదీ చదవండి: 'ఉక్రెయిన్​కు భారత్​ సాయంపై బైడెన్ ప్రశంసలు'

Last Updated : Apr 12, 2022, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.