కెనడా టొరంటోలోని స్వామినారాయణ్ దేవాలయాన్ని ఖలిస్థానీ తీవ్రవాదులు అపవిత్రం చేశారు. ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. "బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిరంపై కెనడియన్ ఖలిస్థానీ తీవ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కెనడియన్ అధికారులకు నివేదించాం" అని హైకమిషన్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
కెనడా పార్లమెంట్ సభ్యుడు చంద్ర ఆర్య ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇదొక్కటే కాదు ఇలాంటి మరెన్నో ఘటనలు కెనడాలో జరిగాయి. కెనడాలోని హిందు దేవాలయాలను తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు" అని అన్నారు. బ్రాంప్టన్ సౌత్ పార్లమెంట్ సభ్యురాలు సోనియా సిద్ధూ సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. "స్వామినారాయణ్ మందిరంలో జరిగిన ఘటన విషయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యా. మనం భిన్న సంస్కృతులు అలవరుచుకునే సమాజంలో జీవిస్తున్నాం. ఈ చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: కారు ప్రమాదానికి గురైన జెలెన్స్కీ.. కాన్వాయ్‌ను ఢీకొట్టిన వాహనం.. ఆ తర్వాత..
ఒకే వేదికపై మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. రెండేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు