ETV Bharat / international

భారత్, చైనా సంయుక్త సైనిక విన్యాసాలు, ఎప్పుడంటే - ఇండియా చైనా మిలిటరీ డ్రిల్స్

భారత్, చైనా మధ్య సంబంధాలు క్షీణిస్తున్న ప్రస్తుత సమయంలో ఇరుదేశాలు కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయా అంటే డ్రాగన్ అవుననే అంటోంది. ఇరుదేశాలు సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొననున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

CHINA-RUSSIA-INDIA-DRILLS
CHINA-RUSSIA-INDIA-DRILLS
author img

By

Published : Aug 17, 2022, 10:46 PM IST

India China military drills: భారత్, చైనా కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించనున్నట్లు డ్రాగన్ పేర్కొంది. రష్యాలో ఈ నెల చివర్లో జరగనున్న వొస్తోక్-2022 విన్యాసాల్లో భారత్​ సైతం పాల్గొననుందని చైనా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా, చైనా సైన్యాల మధ్య ఉన్న సహకారంలో భాగంగా.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) బలగాలను రష్యాకు పంపించనున్నట్లు డ్రాగన్ తన ప్రకటనలో పేర్కొంది. భారత్​ సహా బెలారస్, తజికిస్థాన్, మంగోలియా తదితర దేశాలు సైతం ఈ డ్రిల్స్​లో పాల్గొంటాయని వెల్లడించింది. ఈ విన్యాసాలకు.. ప్రస్తుత అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని చైనా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం, వాస్తవాధీన రేఖ ప్రతిష్టంభనను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

అయితే, చైనా ప్రకటనపై భారత్ స్పందించలేదు. రష్యాలో విన్యాసాల విషయంపై భారత సైన్యం కానీ, రక్షణ శాఖ కానీ ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. గతేడాది రష్యాలో జరిగిన విన్యాసాలకు భారత్ హాజరైంది. చైనా, పాకిస్థాన్ సహా 17 దేశాలు ఆ డ్రిల్స్​లో భాగమయ్యాయి. రష్యా వార్తా సంస్థల ప్రకారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు వొస్తోక్-2022 విన్యాసాలు జరగనున్నాయి. రష్యా తూర్పు ప్రాంతంలో బలగాలు విన్యాసాలు నిర్వహిస్తాయని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.