Israel Hezbollah War : ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ 'హెజ్బొల్లా' కూడా యుద్ధంలోకి వచ్చి చేరింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ఆదివారం హెజ్బొల్లా గ్రూప్ డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించింది. ఇజ్రాయెల్ ఆధీనంలోని గోలన్‌హైట్స్ వద్ద ఈ స్థావరాలు ఉన్నాయి.
హెజ్బొల్లా.. ఈ దాడులపై అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్‌ను వినియోగించినట్లు వెల్లడించింది. పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా తాము దాడి చేసినట్లు ప్రకటించింది. షీబా ఫామ్స్, జిబ్‌డెన్ ఫామ్ వద్ద ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే తాము ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడికి ఇరాన్ నుంచి మద్దతు లభించిందని హమాస్ వెల్లడించింది. తాజాగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా ఈ యుద్ధంలోకి రావడం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.
పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు..
మరోవైపు ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులను అక్కడి దళాలు తిప్పికొట్టాయి. అయితే ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో మాత్రం స్పష్టత లేదు. తమపైకి మోర్టార్ గుండ్లను ప్రయోగించిన ప్రదేశంపై ఎదురు దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. 1981లో గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది.
డ్యాన్స్ పార్టీపై పడి విచక్షణారహితంగా కాల్పులు..
ఇజ్రాయెల్‌లో ఉత్సాహంగా జరుగుతున్న ఓ డ్యాన్స్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు నిస్సహాయంగా పరుగులు తీస్తున్నవారిని పిట్టల్లా కాల్చిచంపారు. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.
-
#WATCH | Gaza City: Aftermath of Israeli retaliation after Islamist movement Hamas attacked Israel, yesterday.
— ANI (@ANI) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Reuters) pic.twitter.com/5XCYxRP2h0
">#WATCH | Gaza City: Aftermath of Israeli retaliation after Islamist movement Hamas attacked Israel, yesterday.
— ANI (@ANI) October 8, 2023
(Source: Reuters) pic.twitter.com/5XCYxRP2h0#WATCH | Gaza City: Aftermath of Israeli retaliation after Islamist movement Hamas attacked Israel, yesterday.
— ANI (@ANI) October 8, 2023
(Source: Reuters) pic.twitter.com/5XCYxRP2h0
శుక్రవారం రాత్రి గాజా-ఇజ్రాయెల్ సరిహద్దుల వద్ద ఓ పొలంలో పార్టీ జరుగుతోంది. ఇజ్రాయెల్‌లో సుక్కోట్ సెలవులు సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు హాజరయ్యారు. శనివారం ఉదయం 6.30 సమయంలో అకస్మాత్తుగా వేల సంఖ్యలో రాకెట్లు విరుచుకుపడటం వల్ల పార్టీ చేసుకుంటున్న వారు బిత్తరపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అది పొలం కావడం తలదాచుకొనేందుకు సురక్షిత ప్రదేశమే కనిపించలేదు.
బాధితులకు ప్రాణాంతకంగా మారిన ట్రాఫిక్ జామ్..!
అయితే కొద్ది సేపటికి తర్వాత రాకెట్ల దాడి ఆగింది. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ పార్టీకి హాజరైన అతిథులు ప్రయత్నించారు. కార్లన్ని ఒకేసారి తీశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అప్పటికే ఆ ప్రాంతంలోకి వచ్చిన హమాస్ ఉగ్రవాద బృందాలకు అది అవకాశంగా దొరికింది. అనంతరం వారిని చుట్టిముట్టిన ఉగ్రవాదులు ఫైరింగ్ మొదలుపెట్టారు. భారీ స్థాయిలో ప్రజలను పొట్టన బెటుకున్నారు. మైదానం వంటి ప్రదేశంలో పారిపోతున్న వారిపై విచక్షణా లేకుండా కాల్పులు జరిపారు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కార్ల కాన్వాయ్‌లపై తూటాల వర్షం కురిపించారు. దీంతో చాలా మంది వాహనాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
Israel Palestine Conflict : ఇజ్రాయెల్-పాలస్తీనా గొడవకు కారణం ఇదే!.. 'హమాస్' ఎలా ఏర్పడిందంటే?