ETV Bharat / international

హమాస్​ కమాండర్​ను హతమార్చిన ఇజ్రాయెల్​- ఆగని భీకర దాడులు

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 3:28 PM IST

‍Hamas Commander Killed : హమాస్‌ను అంతం చేయాలన్న లక్ష్యంతో గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా ఆ సంస్థకు చెందిన మరో కీలక కమాండర్‌ను అంతమొందించింది. తమ వైమానిళ దళం జరిపిన దాడుల్లో హమాస్ కమాండర్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో నాలుగు రోజులుగా యుద్ధ ట్యాంకులతో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ మిలటరీ.. హమాస్‌ మిలిటెంట్ల స్థావరాల్లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

hamas commander killed
hamas commander killed

Hamas Commander Killed : గాజాపై భూతల, వైమానిక దాడులను ఇజ్రాయెల్‌ కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే హమాస్‌ కీలక కమాండర్‌లు హతమవ్వగా.. తాజాగా మరో కమాండర్ ప్రాణాలు కోల్పోయాడు. హమాస్‌ యాంటీ-ట్యాంక్ వ్యవస్థ కమాండర్ మహమ్మద్ అట్జార్‌ను బుధవారం నాటి వైమానిక దాడుల్లో అంతమొందించిన‌ట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ భద్రతా ఏజెన్సీ షిన్ బెట్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. గాజా స్ట్రిప్‌లోని పలు బ్రిగేడ్‌లలోని యాంటీ ట్యాంక్ వ్యవస్థలన్నింటికీ మహమ్మద్ అట్జార్ బాధ్యత వహించాడని అత్యవసర పరిస్థితుల్లో హమాస్‌కు కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది.

హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి..
నాలుగు రోజులుగా గాజాపై యుద్ధట్యాంకులతో భూతల దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్.. హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. తాజాగా మిలిటెంట్ల స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించింది. వీటిలో థర్మోబారిక్ గ్రెనేడ్లు, రాకెట్లు, RPGలు ఇతర ఆయుధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన నాటి నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 8 వేల 500 మందికి పైగా తమ పౌరులు మరణించినట్లు గాజా ప్రకటించింది. హమాస్ దాడుల్లో 14 వందల మంది తమ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్‌కు తెలిపింది.

Gaza Egypt Border Open : అంతకుముందు గాజా స్ట్రిప్‌లో విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నవారు, తీవ్రంగా గాయపడ్డవారికి ఉపశమనం కలిగింది. గాజా స్ట్రిప్‌ నుంచి ఈజిప్టునకు వెళ్లే కీలక రఫా క్రాసింగ్‌.. వీరి కోసం తెరుచుకుంది. ఇందుకు ఈజిప్టు, హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య అమెరికా మద్దతుతో ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరింది.

క్షతగాత్రులను తరలించేందుకు అంగీకరించిన ఈజిప్టు..
Israel Hamas War 2023 : విదేశీ పాస్‌పోర్టుదారులే కాక తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను కూడా తరలించేందుకు గాజాను అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయెల్‌తో పాటు ఈజిప్టు కూడా అంగీకరించింది. వారికి తమ దేశంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు అంగీకరించింది. తమ దేశం నుంచి గాజా లోపలికి అంబులెన్సులను పంపించి.. తీవ్రంగా గాయపడ్డవారిని తీసుకెళుతోంది ఈజిప్టు. ఇప్పటి వరకు 88 మందిని అంబులెన్సులలో ఈజిప్టుకు తీసుకెళ్లింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

గాజాలో హమాస్‌ పాలన అంతమైతే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్‌ పరిపాలన సాగిస్తుందా? అమెరికా ప్లాన్ అదేనట!

Israel Ground Operation : గాజాలో భీకర భూతల దాడులు.. 600స్థావరాలు ధ్యంసం.. సొరంగాల్లో ఉన్నవారిని కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.