ETV Bharat / international

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు- ఆరుగురు మృతి, 24 మందికి గాయాలు - firing in usa

firing
firing
author img

By

Published : Jul 4, 2022, 11:55 PM IST

Updated : Jul 5, 2022, 11:42 AM IST

23:49 July 04

స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్‌పై దుండగుడి కాల్పులు

  • The moment the crowd realized there had been mass shooting in Highland Park, Illinois, at their fourth of July parade. Unfortunately there's nothing more American than this tragedy. pic.twitter.com/beXt9uYP3F

    — Read Wobblies and Zapatistas (@JoshuaPotash) July 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమెరికా స్వాతంత్య్ర దిన వేడుకల్లో నెత్తురు చిందింది. ఇలినాయీ రాష్ట్రంలోని షికాగో నగర శివారు ప్రాంతమైన హైలాండ్‌ పార్క్‌లో సోమవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. 24 మంది గాయపడ్డారు. స్థానికంగా స్వాతంత్య్ర దినోత్సవ కవాతు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే.. కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో కవాతును వీక్షించేందుకు, అందులో పాల్గొనేందుకు వచ్చిన వందల మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కవాతును లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు భవనం పైనుంచి కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

22 ఏళ్ల కుర్రాడిపై అనుమానం
కాల్పులకు పాల్పడిన దుండగుడిని రాబర్ట్‌ క్రిమో (22)గా అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే రాబర్ట్‌ క్రిమో కోసం హైలాండ్‌ పోలీసులు వేట మొదలు పెట్టారు. అతడు పారిపోతుండగా ట్రాఫిక్‌ అధికారులు వెంబడించి అదుపులోకి తీసుకొన్నారు. అతడిని 'పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌'గా పోలీసు శాఖ ప్రకటించింది. అతడు కాల్పులు జరిపిన ప్రదేశంగా భావిస్తున్న దుకాణం గోడకు ఓ నిచ్చెన వేసి ఉందని.. దుకాణంపైన కాల్పులు జరిగిన ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు అత్యంత శక్తిమంతమైన రైఫిల్‌ను వినియోగించినట్లు లేక్‌ కౌంటీ మేజర్‌ క్రైమ్‌ టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. దాడికి వినియోగించిన ఆయుధాన్ని ఎక్కడ కొనుగోలు చేశాడనే విషయంపై దర్యాప్తు మొదలైంది.

స్పందించిన జోబైడెన్‌..
ఈ కాల్పుల ఘటనతో హైలాండ్‌ ప్రాంతంలో వేడుకలను రద్దు చేయాలని పోలీసులు ఆదేశించారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందించారు. ఈ ఘటన తనను షాక్‌కు గురి చేసినట్లు పేర్కొన్నారు. మతిలేని ఈఘటన స్వాతంత్ర్య దినోత్సవం రోజున అమెరికాలో విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు.

వీడియో వైరల్
కాల్పుల ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇక్కడ పరేడ్‌ను చూసేందుకు ఉత్సాహంగా వచ్చి వీధి పక్కనే కూర్చొన్న ప్రేక్షకులు.. కాల్పులు ప్రారంభం కాగానే తీవ్ర భయాందోళనలతో ప్రాణాలు అరచేత పెట్టుకొని పరుగులు తీస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏటా 40 వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా..
అమెరికాలో ఏటా తుపాకీ కాల్పుల ఘటనల్లో 40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గన్‌ వైలెన్స్‌ ఆర్కైవ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటికే 309 కాల్పుల ఘటనలు అమెరికాలో చోటు చేసుకొన్నాయి. వీటిల్లో జులై4వ తేదీనే మూడు చోట్ల కాల్పులు జరిగాయి. కాకపోతే వాటిల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇదీ చదవండి: డెన్మార్క్‌లో కాల్పుల మోత.. ముగ్గురు దుర్మరణం

మిస్ అండ్ మిసెస్ ఉత్తరాంధ్ర 2022 పోటీలు.. సంప్రదాయం ఉట్టిపడేలా మహిళల అలంకరణ

Last Updated : Jul 5, 2022, 11:42 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.