ETV Bharat / international

ఆ దేశ ప్రధానికి డ్రగ్స్​ పరీక్ష, మిత్రులతో పార్టీ చేసుకున్నందుకే - ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్​

ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బహిర్గతం కావడం ఆ దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పార్టీలో ప్రధాని డ్రగ్స్‌ తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు గుప్పించగా తాజాగా ఆమె డ్రగ్స్‌ పరీక్ష చేయించుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 20, 2022, 2:36 PM IST

Finland PM Drug Test: మిత్రులతో కలిసి పార్టీ చేసుకొన్నందుకు గానూ ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్‌ వినియోగించి ఉండొచ్చని, ప్రధాని వాటిని తీసుకొని ఉండొచ్చని విపక్షాలు నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో మారిన్‌ డ్రగ్స్ ఐడెంటిఫికేషన్‌ పరీక్ష చేయించుకున్నారు.

'అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు నేను డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నాను. ఒక వారంలో పరీక్షా ఫలితాలు వస్తాయి. అవి వచ్చిన వెంటనే వాటిని మీడియాతో పంచుకుంటాను' అని ఆమె వెల్లడించారు. ఇటీవల మారిన్‌తో సహా ఆరుగురు మహిళలు డ్యాన్సులు చేస్తోన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో నేలపై మోకాళ్ల మీద కూర్చొని ఆమె ఓ పాటకు డ్యాన్స్‌ చేస్తున్నట్లు కనిపించారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేతలు.. ఆమె డ్రగ్స్‌ తీసుకున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ఈ విమర్శలను ఇదివరకే మారిన్‌ తోసిపుచ్చి, విచారం వ్యక్తం చేశారు. 'ఓ సాయంత్రం వేళ.. మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నాం. ఆ సందర్భంగా డ్యాన్సులు, పాటలు పాడటం వాస్తవమే. ప్రైవేటుగా చేసుకున్న ఆ పార్టీ వీడియో లీక్‌ కావడం దురదృష్టకరం. కేవలం ఆల్కహాల్‌ తప్ప ఎటువంటి డ్రగ్స్‌ తీసుకోలేదు. మేం చేసినవన్నీ చట్టానికి లోబడినవే. మేము ఏ తప్పూ చేయలేదు' అంటూ ఆమె వివరణ ఇచ్చారు.

  • COKE SNORTING Finnish PM 🇫🇮 – LEAKED VIDEO of Sanna Marin partying with friends discussing cocaine. She's taking after her fellow WEF Nazi coke-lover Z€£€N$K¥ pic.twitter.com/e45jr543OL

    — TXT World 🚛🚜🍊 (@txtworld) August 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: హోటల్​పై ముష్కరుల దాడి, 10 మంది దుర్మరణం

పోలీసుల్ని పరుగులు పెట్టించిన పిల్ల కోతి, ఏం చేసిందంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.