సకాలంలో పనులు పూర్తి చేయకుండా కొందరు వాయిదా వేస్తుంటారు. ఇప్పుడు తొందరేం లేదులే.. తర్వాత చేద్దాం అంటూ వారికి వారే నచ్చజెప్పుకుంటారు. కొన్నిసార్లయితే ఫర్వాలేదు. కానీ, ఇదే అలవాటుగా మారిపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థిదశలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రీసెర్చ్ చేస్తున్న వారికి టైమ్ మేనేజ్‌మెంట్ చాలా అవసరం. మధ్యలో ఎవరు ఇబ్బంది పెట్టినా, ఫోన్ కాల్స్‌తో విసిగించినా ఏకాగ్రత లోపించి సరైన ఫలితాలు రాకపోవచ్చు. కష్టమైన పనులు చేయడానికి మనసు కూడా అంగీకరించదు. పనులు వాయిదా అలవాటు ఉన్నవారికి ఇది బాగా వర్తిస్తుంది.
ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి పీహెచ్‌డీ చేస్తున్న ఓ విద్యార్థి వినూత్నంగా ఆలోచించాడు. తాను రీసెర్చ్ చేస్తున్న కేబిన్‌కు ఎదుట ఒక పేపర్ అతికించాడు. " దయచేసి నాతో మాట్లాడొద్దు. నేను పీహెచ్‌డీకి సంబంధించిన పని చేస్తున్నా. ఒక వేళ నేను మాట్లాడటం మొదలుపెడితే మళ్లీ ఆపను. నేను భయంకరమైన వాయిదాలకోరును. అవకాశం దొరికితే చాలు నేను పనులు వాయిదా వేస్తుంటాను. మరీ అవసరమనుకుంటే ఈ మెయిల్ చెయ్యండి" అంటూ రాసుకొచ్చాడు. పీహెచ్‌డీ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఇది అవసరమవుతుందంటూ స్టీవ్ బింగ్‌హామ్ అనే అధ్యాపకుడు ట్విటర్‌లో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి:
ముగ్గురు శాస్త్రవేత్తలను వరించిన రసాయనశాస్త్ర నోబెల్.. ఆయనకు రెండోసారి