ETV Bharat / international

తుర్కియే భూకంపం.. రూ.7లక్షల కోట్ల నష్టం.. మరణాలు 72వేలు!

author img

By

Published : Feb 14, 2023, 8:37 PM IST

తుర్కియే, సిరియాలో సంభవించిన భారీ భూకంపంతో సుమారు 7లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇది ఆయా దేశాల జీడీపీలో పది శాతం కంటే ఎక్కువని తెలుస్తోంది. మరణాల సంఖ్య కూడా 72,000కు పెరగవచ్చని తాజా నివేదిక  పేర్కొంది. మరోవైపు తుర్కియేలో 200గంటల తర్వాత శిథిలాల నుంచి 18ఏళ్ల యువకుడిని సహాయ బృందాలు ప్రాణాలతో కాపాడాయి. భూకంపం వల్ల విధ్వంసం ఎక్కువగా ఉండటానికి నిర్మాణ కాంట్రాక్టర్లే కారణమని అధికారులు ఆరోపిస్తున్నారు.

turkey syria earthquake
turkey syria earthquake

తుర్కియే, సిరియాలో పెను విషాదాన్ని నింపిన భూకంపం.. ఆ దేశాలకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ప్రాణనష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 6న సంభవించిన భూకంపం వల్ల.. సుమారు రూ.6.95లక్షల కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని తుర్కియేలోని వాణిజ్య సంఘాలు అంచనా వేశాయి. ఇది ఆయా దేశాల జీడీపీలో 10శాతం కంటే ఎక్కువని పేర్కొన్నాయి. తీవ్ర భూకంపం ధాటికి ఒక్క తుర్కియేలోనే 25,000 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 42,000 ఇళ్లు కూలిపోవడమో లేదా అత్యవసరంగా కూల్చాల్సిన పరిస్థితి తలెత్తిందని తుర్కియే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మురాత్‌ కురుమ్‌ తెలిపారు.

కేవలం నివాస ప్రాంతాలు దెబ్బతినడం వల్లే 70.75 బిలియన్‌ డాలర్ల ఆర్థికనష్టం వాటిల్లినట్లు టర్కిష్‌ ఎంటర్‌ప్రైజ్‌ అండ్‌ బిజినెస్‌ కాన్ఫెడరేషన్‌ ప్రాథమికంగా అంచనా వేసింది. జాతీయాదాయానికి 10.4బిలియన్‌ డాలర్లు, పనిరోజుల పరంగా 2.91 బిలియన్‌ డాలర్ల నష్టం కలిగినట్లు తెలిపింది. భూకంపం వల్ల తుర్కియేకు 84 బిలియన్‌ డాలర్ల నష్టం జరిగిందని అంచనా వేసింది. ఇది ఆ దేశ జీడీపీలో 10 శాతం కన్నా ఎక్కువని పేర్కొంది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరగవచ్చని.. సుమారు 72,000 మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తాజా నివేదికలో వెల్లడించింది.

turkey syria earthquake
తుర్కియే భూకంపం
turkey syria earthquake
తుర్కియే భూకంపం

మరోవైపు తుర్కియే-సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అదియమాన్‌ నగరంలో.. 200 గంటల తర్వాత 18ఏళ్ల యువకుడిని సహాయ బృందాలు శిథిలాల కింది నుంచి ప్రాణాలతో కాపాడాయి. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుని ఉండే అవకాశం ఉంది. గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు బాధితులను రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. అయితే, భూకంపం సంభవించి వారం రోజులు పూర్తవడం వల్ల శిథిలాల కింద చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడతారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించేందుకు స్నిఫర్‌ డాగ్స్‌, థర్మల్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు.

turkey syria earthquake
తుర్కియే భూకంపం

తుర్కియేలో భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కూలాయి. తుర్కియేలో భారీ విధ్వంసం జరగటానికి, మృతులసంఖ్య ఎక్కువగా ఉండటానికి.. నిర్మాణ లోపాలే కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారీ భవనాలు కూలటానికి కాంట్రాక్టర్లే కారణమని అధికారవర్గాలు ఆరోపిస్తున్నాయి. భూకంపాలను తట్టుకునేలా ఇంజనీరింగ్‌ ప్రమాణాల కోడ్‌ను తుర్కియే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే ఆ నిబంధనలను చాలా వరకు పాటించటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. మరణాల సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల అధికారులు మృతుల సంఖ్య వివరాల వెల్లడిని తగ్గించారు. రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే ప్రకటిస్తున్నారు.

turkey syria earthquake
తుర్కియే భూకంపం

ఇవీ చదవండి : శిథిలాల కిందే కుళ్లిపోతున్న శవాలు.. 35వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

మైనస్​ 22 డిగ్రీల చలిలో అల్లాడుతున్న భూకంప బాధితులు.. 6 రోజులుగా కార్లలోనే నిద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.