ETV Bharat / international

గూగుల్​ కో-ఫౌండర్​ భార్యతో మస్క్ అఫైర్.. ఈయన వల్లే వారికి విడాకులు! - మస్క్​ ట్విట్టర్​ డీల్​

ఎలాన్​ మస్క్​.. టెస్లా, స్పేస్​ ఎక్స్​ వంటి దిగ్గజ సంస్థలకు సీఈఓ. సంచలనాలతో పాటు వివాదాలకూ ఈయన కేరాఫ్​గా నిలుస్తుంటారు. తాజాగా మస్క్​కు సంబంధించి మరో విషయం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గూగుల్​ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్​ భార్యతో.. మస్క్​ అఫైర్​ పెట్టుకున్నారట. ఈ వార్తపై మస్క్​ కూడా స్పందించారు.

Elon Musk had an affair with Google co-founder  wife?

author img

By

Published : Jul 25, 2022, 12:59 PM IST

Updated : Jul 25, 2022, 1:47 PM IST

ఎలాన్​ మస్క్​.. వివాదాలు.. ఈ రెండింటికీ ఏదో విడదీయరాని బంధం ఉన్నట్లుంది. సంచలన ప్రకటనలు చేస్తూ.. వివాదాల్లోనూ నిలిచే టెస్లా, స్పేస్​ ఎక్స్​ సీఈఓ మస్క్​ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. బిలియనీర్​, గూగుల్​ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్​ భార్య నికోల్​ షానహాన్​తో మస్క్​ వివాహేతర సంబంధం నడిపిస్తున్నారట. ఈ మేరకు వాల్​స్ట్రీట్​ జర్నల్​ కూడా ఓ కథనం ప్రచురించింది.
చాలా ఏళ్లుగా మస్క్​, బ్రిన్​ మంచి స్నేహితులుగా ఉన్నారు. అయితే తన భార్య నికోల్​తో మస్క్​కు అఫైర్​ ఉందని తెలుసుకున్నప్పటి నుంచి బ్రిన్-​ మస్క్​ స్నేహబంధం చెడిందని వార్తలు వస్తున్నాయి.

బ్రిన్​ ఈ ఏడాది జనవరిలో నికోల్​ షానహాన్​తో విడాకులకు దరఖాస్తు చేశారు. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని దరఖాస్తులో పేర్కొన్నారు. 2021, డిసెంబర్​ 15 నుంచి వేరుగానే ఉంటున్నట్లు చెప్పిన బ్రిన్​.. తన కుమార్తె బాధ్యతలను ఇద్దరం చూసుకుంటామని చెప్పారు. నికోల్​ నుంచి తనకు ఎలాంటి మద్దతు అవసరం లేదని తెలిపారు.

ఈ ఏడాది ప్రారంభంలోనే బ్రిన్​ను ఓ పార్టీలో కలిసిన మస్క్​.. క్షమాపణలు కోరినట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. టెస్లా కార్లను తొలుత పొందిన వ్యక్తుల జాబితాలోనూ బ్రిన్​ ఉన్నట్లు సమాచారం. ఇంకా.. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో టెస్లా సంస్థకు బ్రిన్​ 5 లక్షల యూఎస్​ డాలర్ల సాయం అందించి ఆదుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

నికోల్​తో సంబంధం ఉందని వస్తున్న వార్తలపై మస్క్​ స్పందించారు. ఇదంతా అర్థరహితమని పేర్కొన్న ఆయన.. బ్రిన్​, తాను మంచి స్నేహితులం అని చెప్పారు. గతరాత్రి కూడా పార్టీలో కలిసినట్లు ట్వీట్​ చేశారు. నికోల్​ను గడిచిన మూడేళ్లలో రెండు సార్లు మాత్రమే చూశానని, అప్పుడు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారని అన్నారు. ఇద్దరి మధ్య రొమాంటిక్​గా ఏం జరగలేదని బదులిచ్చారు.

9 మందికి తండ్రి.. మస్క్​ తన గర్ల్​ఫ్రెండ్​, సింగర్​ గ్రైమ్స్​తో విడిపోయిన కొన్ని నెలలకు మస్క్​- నికోల్​ వ్యవహారం తెరపైకి వచ్చింది. మస్క్​కు.. ఇప్పటికే గ్రైమ్స్​తో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల మరో వార్త కూడా చక్కర్లు కొట్టింది. తనకే చెందిన న్యూరాలింక్​ కంపెనీలో ఎగ్జిక్యూటివ్​ షివోన్​ జిలీస్​తోనూ మస్క్​కు అఫైర్​ ఉందట. గతేడాది 2021లో ఈమెతో కలిసి కవలలకు జన్మనిచ్చినట్లు తెలిసింది. తన మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో ఐదుగురు పిల్లలకు తండ్రయ్యారు. ఇలా మొత్తం మస్క్​కు మొత్తం 9 మంది పిల్లలు ఉన్నారు. అంతకుముందు ప్రముఖ నటుడు జానీ డెప్​ భార్య, హాలీవుడ్​ నటి అంబర్​హెర్డ్​తోనూ.. రెండుసార్లు డేటింగ్​ చేశారు ఎలాన్​ మస్క్​. ఇప్పుడు 27 ఏళ్ల ఆస్ట్రేలియన్​ నటి నటాషా బాసెట్​తో ప్రేమాయణం సాగిస్తున్నారు. ఇటీవల వీరి ఫొటోలు కూడా నెట్టింట దర్శనమిచ్చాయి.

Elon Musk had an affair with Google co-founder  wife?
అంబర్​హెర్డ్​తో మస్క్​

ఆస్ట్రేలియన్​ నటి నటాషా బాసెట్​తో మస్క్​
ఇదిలా ఉంటే.. మస్క్​ తండ్రి ఎరోల్​ మస్క్​.. తన 35 ఏళ్ల కూతురుతో (రెండో భార్య కుమార్తె) సహజీవనం చేసినట్లు, ఆమెతో ఓ బిడ్డను కూడా కన్నట్లు ఇటీవల వెల్లడించడం సంచలనమైంది.

ఇవీ చూడండి: 'అన్నీ మర్చిపోయి ముందుకు సాగండి'.. మాజీ ప్రేయసిపై మస్క్ ట్వీట్

9 మంది పిల్లలకు తండ్రైన 'మస్క్'​.. జననాల రేటు పెంచేందుకేనట!

జానీ డెప్​-అంబర్​ హెర్డ్​.. ప్రేమ కథ నుంచి కోర్టు దాకా.. వయా ఎలాన్ మస్క్​!

కొత్త గర్ల్​ఫ్రెండ్​తో ఎలాన్ మస్క్​.. ఫ్రాన్స్​ హోటల్​లో అలా.. ఫొటోలు వైరల్

Last Updated : Jul 25, 2022, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.