ETV Bharat / international

చిలీలో కార్చిచ్చు విధ్వంసం.. 13 మంది మృతి.. 14వేల హెక్టార్ల అడవి దగ్ధం - చిలీ అగ్నిప్రమాదాలు

చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావాలనం ధాటికి ఇళ్లు, వేలాది ఎకరాల అటవీ సంపద కాలిబూడిదైపోతోంది. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

chile-wildfires-in-2023
CHILE WILDFIRE
author img

By

Published : Feb 4, 2023, 10:19 AM IST

చిలీలో తలెత్తిన భయంకరమైన కార్చిచ్చుల ధాటికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 190కి పైగా ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. వందలాది ఇళ్లను మంటలు దహించివేశాయి. మొత్తం 14వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దహించుకుపోయిందని అధికారులు పేర్కొన్నారు. వేసవి వడగాలుల వల్ల కార్చిచ్చులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు.

భారీ గాలులకు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని చిలీ ప్రభుత్వం వెల్లడించింది. మంటలు ఆర్పేందుకు వచ్చిన హెలికాప్టర్ కూలి పైలెట్ మృతి చెందినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 191 ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగగా... 45 ప్రాంతాల్లో మాత్రమే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారని చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ ప్రకటించారు. చిలీలో గత కొన్నిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో అత్యవసర పరిస్థితిని విధించి సైన్యాన్ని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. కార్చిచ్చును అదుపు చేయడానికి అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల నుంచి విమానాలు రానున్నాయని అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.