ETV Bharat / international

చైనా విధేయుడికే హాంకాంగ్​ పగ్గాలు.. కొత్త అధిపతిగా జాన్​ లీ ఎన్నిక - జాన్ లీ

John Lee Elected As Honkong Next Leader: హాంకాంగ్​ నగర నూతన అధిపతిగా చైనా అనుకూల నేత జాన్​ లీ ఎన్నికయ్యారు. గతంలో హాంకాంగ్​లో జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ముఖ్య అధికారిగా కఠినంగా అణిచివేసిన లీ వైపే అక్కడి ప్రజలు మొగ్గు చూపారు.

Beijing loyalist John Lee elected as Hong Kong''s next leaderBeijing loyalist John Lee elected as Hong Kong''s next leader
Beijing loyalist John Lee elected as Hong Kong''s next leader
author img

By

Published : May 9, 2022, 5:36 AM IST

John Lee Elected As Honkong Next Leader: చైనా అనుకూల నేత జాన్​ లీ.. హాంకాంగ్​ నగర నూతన అధిపతిగా ఎన్నికయ్యారు. దీంతో హాంకాంగ్​ పరిపాలన వ్యవహారాలపై బీజింగ్​ పట్టు మరింత బిగిసింది. ఆదివారం వెలువరించిన ఎన్నికల ఫలితాల్లో జాన్​ లీకి 89 శాతం సీట్లు లభించాయి. సుమారు 1500 మంది కమిటీ సభ్యుల్లో చాలా మంది గతంలో హాంకాంగ్​లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని భద్రతా ముఖ్య అధికారిగా కఠినంగా అణిచివేసిన లీ వైపే మొగ్గు చూపారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎన్నికల్లో లీ ఒక్కరే పోటీ చేయడం. దీంతో ఆయన విజయం నల్లేరుపై నడకైంది. 1416 ఓట్లు ఆయనకు అనుకూలంగా వచ్చాయి. జులై ఒకటిన లీ.. ప్రస్తుత నేత కారీ లామ్​ నుంచి పగ్గాలు చేపట్టనున్నారు.

ఇదీ చదవండి: మహిళలకు నరకం చూపిస్తున్న తాలిబన్లు.. ఇంట్లోంచి కాలు బయటపెడితే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.