ETV Bharat / international

అమెరికాలో విమాన రాకపోకలకు బ్రేక్.. అనేక గంటల తర్వాత పునరుద్ధరణ

సాంకేతిక సమస్యల కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో అనేక గంటలపాటు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన అధికారులు సేవలను పునురుద్ధరించారు.

flights grounded
అమెరికాలో నిలిచిపోయిన విమానరాకపోకలు
author img

By

Published : Jan 11, 2023, 5:07 PM IST

Updated : Jan 11, 2023, 7:44 PM IST

సాంకేతిక సమస్యల కారణంగా అమెరికాలో విమాన రాకపోకలు అనేక గంటలు నిలిచిపోయాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన అధికారులు సేవలను పునురుద్ధరించారు.
బుధవారం సాంకేతిక సమస్య వల్ల దేశమంతటా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) కంప్యూటర్‌ సాఫ్ట్​వేర్​లో మొరాయించింది. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ఎఫ్‌ఏఏ ఇచ్చే నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌)లో సమస్య ఏర్పడింది. దీంతో అమెరికాలో వందలాది విమానాలు ఆలస్యం కాగా.. కొన్ని రద్దయ్యాయి.

Last Updated : Jan 11, 2023, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.