ETV Bharat / international

పుతిన్ కలల వంతెన పేల్చివేత వెనక మాస్టర్ ప్లాన్.. అమెరికా పడవలతో..! - ఉక్రెయిన్ రష్యా యుద్ధం

ఈ శతాబ్దంలోనే అత్యున్నత నిర్మాణంగా రష్యన్లు భావించే కెర్చి వంతెన కూల్చివేత వెనక పక్కా ప్రణాళిక ఉందా? కొన్ని నెలల పాటు రెక్కీ నిర్వహించి మరీ బ్రిడ్జిపై దాడి చేశారా? పుతిన్‌ ఆరోపించినట్లుగా కెర్చి వంతెన కూల్చివేత వెనక ఉక్రెయిన్ హస్తం ఉందా? దాడి తర్వాత జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఈ దాడి తర్వాత రష్యా అణ్వాయుధాల వినియోగానికి మరింత దగ్గరైందని ప్రపంచం ఎందుకు భయపడుతోంది? ఇప్పటికే ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తున్న పుతిన్‌ బలగాలు మరింత విధ్వంసం సృష్టించనున్నాయా? రష్యా కెర్చి వంతెన కూల్చివేత తర్వాత పరిణామాలు అసలు ఎటు దారి తీస్తున్నాయ్?

2022 Crimean Bridge explosion master plan

author img

By

Published : Oct 10, 2022, 10:55 PM IST

ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో దూసుకుపోతున్న రష్యాకు కెర్చ్‌ వంతెన కూల్చివేతతో పెద్ద ఎదురుదెబ్బ తగలింది. ఈ ఘటనకు ఏ దేశం, సంస్థ బాధ్యత తీసుకోకపోయినా మాస్కో అనుమానాలు ఉక్రెయిన్‌పైనే ఉన్నాయి. ట్రక్కు బాంబు సాయంతో ఈ దాడి జరిగినట్లు తొలుత అంతా భావించారు. కానీ దీని వెనక ఒక పెద్ద మాస్టర్‌ ప్లాన్‌ ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. క్రిమియా ద్వీపకల్పంలో కొంతకాలంగా జరిగిన పరిణామాలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కెర్చ్‌ వంతెనపై పేలుడు జరిగిన సమయంలో దీనిపై ఒక ట్రక్కు ప్రయాణిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్న మరో వంతెనపై ఓ రైలు ఇంధన వ్యాగన్లతో ట్రక్కు సమీపంలోకి రాగానే భారీ పేలుడు సంభవించింది. కానీ, ఈ పేలుడు కచ్చితంగా ట్రక్కు నుంచే జరిగినట్లు ఎక్కడా తెలియడం లేదు. వేర్వేరు కోణాల్లో ఈ దృశ్యాలను పరిశీలిస్తే పేలుడుకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.

2022 Crimean Bridge explosion master plan
.

పేలుడు జరిగిన రోజే ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ ట్విటర్‌ ఖాతా OSINT అమెచ్యూర్‌ ఓ వీడియో క్లిప్‌ విడుదల చేసింది. దానిలో వంతెనపై ట్రక్కు ఓ ప్రదేశంలోకి రాగానే.. వంతెన పిల్లర్ల మధ్య నుంచి.. ఓ చిన్నపాటి పడవ వంటిది తేలుతూ బయటకు వచ్చింది. మరు క్షణమే భారీ పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం తతంగం పక్కనే ఉన్న వంతెనపై అమర్చిన సెక్యూరిటీ కెమెరాలో నిక్షిప్తమైనట్లు తెలుస్తోంది. సముద్రపు డ్రోన్‌ సాయంతో ఈ దాడి చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాలోని పెంటగాన్‌ నుంచి ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌కు అందిన 800 మిలియన్‌ డాలర్ల రక్షణ సాయం ప్యాకేజీలో కొన్ని 'మానవ రహిత తీర రక్షణ పడవలు' కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ జాన్‌కెర్బీ కూడా ధ్రువీకరించారు. దీంతో అమెరికా పడవలను ఉపయోగించి ఉక్రెయిన్‌ దాడి చేసిందన్న అనుమానాలు నెలకొన్నాయి. కెర్చ్‌ వంతెన పేల్చివేతతో క్రిమియాకు సరుకులు, ఆయుధాలు, ఇంధన రవాణా దాదాపు నిలిచిపోయాయి. ఉక్రెయిన్‌ ఈ దాడికి బాధ్యత స్వీకరించలేదు. కానీ, సంబరాలు మాత్రం చేసుకుంటోంది.

కెర్చ్‌ వంతెన కూల్చివేత తర్వాత రష్యా అణ్వాయుధాల వినియోగానికి మరింత దగ్గరైందని ప్రపంచం భయపడుతోంది. వంతెనపై దాడిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్‌ సేనలే ఈ దాడికి పాల్పడ్డాయని ఆరోపించారు. పౌర మౌలిక సదుపాయాలను నాశనం చేసేందుకు ఉగ్ర దాడి చేశారని పుతిన్‌ అన్నారు. ఈ దాడితో ఉక్రెయిన్‌పై ముమ్మర దాడులు చేయాలని ఆదేశించిన రష్యా అధినేత.... భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. కెర్చ్‌ బ్రిడ్జి కూల్చివేతపై పరోక్షంగా స్పందించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. దురదృష్టవశాత్తు క్రిమియాలో బాగా మబ్బుపట్టిందని ఎద్దేవా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.