ETV Bharat / international

కొవాగ్జిన్​కు 'ప్రపంచ' గుర్తింపు- ఇక టీకా ఉత్పత్తి జోరు ​

భారత్​ బయోటెక్​ రూపొందించిన కొవాగ్జిన్​ టీకా అత్యవసర వినియోగానికి (Covaxin WHO Approval) డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం తెలిపింది. డబ్ల్యూహెచ్​ఓ ఆమెదం పొందిన టీకాల జాబితాలో కొవాగ్జిన్​ చేరడం మంచి పరిణామం అన్నారు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ టెడ్రోస్​ అధనోమ్​.

covaxin
కొవాగ్జిన్
author img

By

Published : Nov 3, 2021, 9:45 PM IST

Updated : Nov 4, 2021, 6:37 AM IST

దేశీయంగా తయారైన కొవాగ్జిన్​ అత్యవసర వినియోగానికి (Covaxin WHO Approval) ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది. టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ సిఫార్సును పరిశీలించిన డబ్ల్యూహెచ్​ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్​ఓ బుధవారం ప్రకటించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్ల జాబితాలో భారత్​కు చెందిన కొవాగ్జిన్​ స్థానం సంపాదించింది.

​ "టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ సిఫార్సును పరిశీలించి కొవాగ్జిన్​కు (Covaxin WHO Approval) అనుమతులిచ్చాం. కొవిడ్​ నుంచి రక్షణ కల్పించడంలో నిర్దేశించిన ప్రమాణాలను కొవాగ్జిన్​ అధిగమించిందని నిపుణులు సిఫార్సులో పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్​ సురక్షితమైంది. టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ సిఫార్సు తర్వాత మరో నిపుణుల బృందం కూడా ఈ వ్యాక్సిన్​ పనితీరును పరిశీలించింది. అయితే ప్రస్తుతం గర్భిణీలకు కొవాగ్జిన్​ ఇవ్వడంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం గర్భిణీలకు ఈ వ్యాక్సిన్​ సురక్షితం అని చెప్పలేము."

-ప్రపంచ ఆరోగ్య సంస్థ

కొవాగ్జిన్​కు ఆమోదం లభించడం ద్వారా టీకాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు వీలుపడుతుందన్నారు భారత్​ బయోటెక్​ ఛైర్మన్​ కృష్ణా ఎల్లా.

"దేశంలో విస్తృతంగా అందజేస్తున్న, సురక్షితమైన, ప్రభావవంతమైన కొవాగ్జిన్‌ టీకాకు డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర అనుమతి లభించటం అత్యంత కీలక పరిణామం. టీకా తయారీలో అనుసరించిన నాణ్యమైన, భద్రత పరమైన ప్రమాణాల వల్లే డబ్ల్యూహెచ్​ఓ నిర్ధేశించిన శాస్త్రీయ ప్రమాణాలను కొవాగ్జిన్‌ అధిగమించింది. కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం లభించటం ద్వారా టీకాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు వీలుపడుతుంది."

-కృష్ణా ఎల్లా, భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌

కరోనా పరిస్థితుల్లో భారత్‌ బయోటెక్‌, తమ భాగస్వాములు చేసిన అద్భుత ప్రయత్నానికి దక్కిన గొప్ప గౌరవం ఇదని సుచిత్రా ఎల్లా అన్నారు. పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో తయారైన ప్రపంచ స్థాయి టీకా కొవాగ్జిన్‌ అన్న ఆమె.. మరింత ప్రభావవంతమైన పనితీరు చూపేందుకు ఇది సదవకాశమని పేర్కొన్నారు. జూన్‌లోనే మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా డబ్ల్యూహెచ్​ఓకు అందించామన్న భారత్‌ బయోటెక్‌.. జూలైలో ఈయూఎల్​ ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.

కొవాగ్జిన్​కు అనుమతితో మరో వ్యాక్సిన్​ ప్రపంచ దేశాలకు అందుబాటులోకి వచ్చిందన్నారు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ టెడ్రోస్​ అధనోమ్.

"డబ్ల్యూహెచ్​ఓ నుంచి అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన టీకాల జాబితాలో మరో కొవాగ్జిన్​ చేరడం హర్షనీయం. ఎన్ని ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే అంత సమర్థమంతంగా వైరస్​పై పోరాడవచ్చు."

-టెడ్రోస్​ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​

కొవాగ్జిన్​ టీకా అనుమతిపై ఐసీఎంఆర్​ హర్షం వ్యక్తం చేసింది.

"డబ్ల్యూహెచ్​ఓ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్​ ఎగుమతికి మార్గం సుగమమైంది. 100 శాతం దేశీయంగా తయారైన ఈ వ్యాక్సిన్​ను ప్రపంచ దేశాలకు అందిస్తాము."

-డాక్టర్​ బలరాం భార్గవ, ఐసీఎంఆర్ డైరెక్టర్

కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ అనుమతి లభించడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. మేడిన్​ ఇండియా వ్యాక్సిన్​కు అనుమతి లభించిన సందర్భంగా టీకా తయారీకి కృషి చేసిన ఐసీఎంఆర్​, భారత్​ బయోటెక్​ శాస్ట్రవేత్తలను అభినందించారు.

కొవాగ్జిన్​కు అనుమతి ఇలా..

  • కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు భారత్‌ బయోటెక్‌ తొలిసారి ఏప్రిల్‌ 19న డబ్ల్యూహెచ్​ఓకు దరఖాస్తు చేసుకుంది.
  • పలుమార్లు నిపుణుల కమిటీ భేటీ అయి కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలపై సమీక్షించింది.
  • కొవాగ్జిన్ టీకాకు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ హోదా ఇచ్చే విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు అదనపు సమాచారం ఇవ్వాల్సిందిగా భారత్‌ బయోటెక్‌ను అక్టోబర్ 26వ తేదీన టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ కోరింది.
  • భారత్ బయోటెక్ సమర్పించిన సమాచారాన్ని విశ్లేషించిన మీదట కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాలంటూ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు డబ్ల్యూహెచ్​ఓకు సిఫార్సు చేయగా.. ఈ సిఫార్సులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం పచ్చజెండా ఊపింది.

కొవాగ్జిన్​ ప్రత్యేకలు..

  • యూకే, బ్రెజిల్‌ వేరియంట్లను కొవాగ్జిన్‌ బలంగా నిలువరించినట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలింది.
  • కొవిడ్‌ను ఎదుర్కోవటంలో కొవాగ్జిన్ 78% సమర్థంగా పని చేస్తుందని వెల్లడైంది.
  • డెల్టా వేరియంట్​పై 65.2 శాతం రక్షణ లభిస్తుందని ఇప్పటికే పరీక్షల్లో తేలింది.

ప్రస్తుతం మన దేశంలో కొవాగ్జిన్‌తో పాటుగా కొవిషీల్డ్ టీకాను విరివిగా ఉపయోగిస్తున్నారు.

ఇదీ చూడండి : కొవాగ్జిన్​కు ఆస్ట్రేలియా అధికారిక గుర్తింపు

Last Updated : Nov 4, 2021, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.