ETV Bharat / international

వుహాన్ ల్యాబ్​పై డబ్ల్యూహెచ్ఓ నిపుణుడి అనుమానం - TV2

వుహాన్ ల్యాబ్ భద్రతా ప్రమాణాలపై డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యం, రక్షణ లేకుండానే కరోనాపై ల్యాబ్​లో పరిశోధనలు జరిగాయని వెల్లడించారు. సముద్ర జంతువుల మార్కెట్​కు 500 మీటర్ల దూరంలోనే ల్యాబ్ ఉందని గుర్తు చేశారు.

wuhan lab
వుహాన్ ల్యాబ్​పై డబ్ల్యూహెచ్ఓ నిపుణుడి అనుమానం
author img

By

Published : Aug 13, 2021, 1:25 PM IST

చైనాలో కరోనా వైరస్ ఆవిర్భావం గురించి దర్యాప్తు చేసేందుకు వెళ్లిన నిపుణుల్లో ఒకరైన పీటర్ బెన్ ఎంబరెక్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. ఎలాంటి నైపుణ్యం, రక్షణ లేకుండానే కరోనా వైరస్​పై వుహాన్ ల్యాబ్​లో పరిశోధనలు జరిగాయని అన్నారు. ల్యాబ్​లో భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ల్యాబ్​లో నుంచే వైరస్ లీక్ అయిందనే అనుమానాలకు బలం చేకూర్చినట్లైంది.

డానిష్ టీవీ2 డాక్యుమెంటరీలో భాగంగా ఈ విషయాలు వెల్లడించారు బెన్. జూన్​లోనే రికార్డుచేసిన ఈ డాక్యుమెంటరీ తాజాగా బయటకు వచ్చింది. వుహాన్ మార్కెట్లో జంతువులకు, మనుషులకు మధ్య కాంటాక్ట్ అధికంగా ఉందని పేర్కొన్నారు.

"నాకు ఆందోళన కలిగించే విషయం ఆ ల్యాబ్ గురించే. హునాన్ మార్కెట్​కు 500 మీటర్ల దూరంలోనే వుహాన్ చైనీస్ సీడీసీ ల్యాబ్ ఉంది. గబ్బిలాల నమూనాలు సేకరించే సమయంలో ల్యాబ్ సిబ్బంది కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది."

-పీటర్ బెన్ ఎంబరెక్, డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు

అయితే, వుహాన్​లో పర్యటించిన డబ్ల్యూహెచ్ఓ బృందం ల్యాబ్ లీక్ థియరీని తొలుత ఖండించింది. ప్యాక్ చేసిన సముద్ర ఆహారం ద్వారా వైరస్ వ్యాపించిందనే అనుమానాలు వ్యక్తం చేసింది. కానీ తర్వాత మాత్రం.. ల్యాబ్ లీక్​పై మాట మార్చింది. కరోనా ఇక్కడి నుంచి లీక్ అవ్వలేదని నిర్ధరణకు రావడం సరికాదని పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.