ETV Bharat / international

రెండోసారి పుతిన్​తో మోదీ ఫోన్ సంభాషణ - పుతిన్​తో మాట్లాడిన మోదీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించడంపై చర్చించారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ తెలిపింది.

PM Modi spoke to Putin
PM Modi spoke to Putin
author img

By

Published : Mar 3, 2022, 12:34 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఖార్కివ్‌లో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన పరిస్థితిపై పుతిన్​తో చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సంఘర్షణ ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించడంపై పుతిన్​తో మోదీ మాట్లాడినట్లు చెప్పింది. ఆరు రోజులుగా రష్యా-ఉక్రెయిన్​ మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో పుతిన్​తో మోదీ మాట్లాడటం ఇది రెండోసారి.

రష్యా కీలక ప్రకటన

యుద్ధంలో తమ సైనికుల మృతిపై తొలిసారి రష్యా ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై దాడుల ఘటనలో 498 మంది సైనికులు మరణించినట్లు ఆ దేశ రక్షణశాఖ తెలిపింది. మరో 1,597 మంది గాయపడ్డారని పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే యుద్ధంలో భారీ సంఖ్యలో రష్యన్​ సైనికులు చనిపోయినట్లు వస్తున్న వార్తల తోసిపుచ్చారు రష్యా సైన్యాధికారి మేజర్​ జనరల్​ ఇగోర్​ కోనాషెంకోవ్​. ఈ క్రమంలోనే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు 2,870 మందికిపైగా ఉక్రెయిన్​ సైనికులు మరణించారని.. 3,700 మందికిపైగా గాయపడ్డారని కోనాషెంకోవ్​ తెలిపారు. 572 మంది ఇతరులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే దీనిని ఉక్రెయిన్​ ఇంకా ధ్రువీకరించలేదు.

ఇదీ చూడండి: ఐరాసలో రష్యా వ్యతిరేక ఓటింగ్​కు మరోసారి భారత్ దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.