ETV Bharat / international

కీవ్​లోకి రష్యా బలగాలు- శివార్లలో కాల్పుల మోత - ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్డేట్స్​

ukraine-russia-war-live-updates
రష్యా-ఉక్రెయిన్​ మధ్య కొలిక్కిరాని చర్చలు
author img

By

Published : Mar 11, 2022, 6:38 AM IST

Updated : Mar 12, 2022, 7:28 AM IST

03:55 March 12

ఉక్రెయిన్​లో డ్నిప్రో, ఇవానో-ఫ్రాంకివ్స్క్‌లపై బాంబుల మోత మోగుతుంది. కీవ్, ఖార్కివ్ ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మారియుపోల్​ దిగ్బంధనం, బాంబుల మోత కారణంగా మార్చి 11 నాటికి 1,582 మంది పౌరులు మరణించారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది

03:54 March 12

రష్యా, బెలారస్​లకు అమెరికన్ లగ్జరీ వస్తువుల ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

21:11 March 11

కీవ్​లోకి రష్యా బలగాలు- లగ్జరీ వస్తువుల ఎగుమతులపై అమెరికా నిషేధం

రష్యా సేనలు కీవ్‌ ప్రాంతంలోకి చొరబడినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కీవ్‌ శివారల్లో భీకర కాల్పులు జరుపుతున్నట్టు తెలిపింది.

17:40 March 11

భారత విద్యార్థులకు రష్యాలోని రాయబార కార్యాలయం కీలక సూచనలు

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. రష్యాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. భారత విద్యార్థులు ప్రస్తుతం రష్యాను వీడేందుకు ఎటువంటి భద్రతా కారణాలు కనిపించడం లేదని తెలిపింది. విద్యార్థులతోసహా భారతీయ పౌరుల భద్రత విషయమై సంబంధిత అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. అయితే, రష్యాలో బ్యాంకింగ్ సేవలతోపాటు ఇక్కడి నుంచి భారత్‌కు నేరుగా విమాన కనెక్టివిటీ విషయంలో అంతరాయం ఏర్పడుతోన్న మాట వాస్తవమేనని.. ఈ విషయాల్లో ఆందోళన ఉన్నవారు తిరిగి భారత్‌కు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని సూచించింది. అకాడమిక్ ప్రోగ్రామ్‌లకు సంబంధించి అనేక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఆన్‌లైన్ దూరవిద్య విధానానికి మారినట్లు తమకు సమాచారం ఇచ్చాయని పేర్కొంది. ఈ విషయమై విద్యార్థులు సంబంధిత విశ్వవిద్యాలయాలతో టచ్‌లో ఉండాలని సూచించింది.

16:23 March 11

25 లక్షలకు చేరుకున్న ఉక్రెయిన్‌ శరణార్థుల సంఖ్య: ఐరాస

రష్యా దాడుల మొదలు యుద్ధ సంక్షోభంలో కూరుకుపోయిన ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటివరకు పొరుగు దేశాలకు తరలివెళ్లిపోయినవారి సంఖ్య 25 లక్షలకు చేరుకుందని ఐరాస శరణార్థుల ఏజెన్సీ(యూఎన్‌హెచ్‌సీఆర్‌) హై కమిషనర్‌ ఫిలిప్పొ గ్రాండీ శుక్రవారం వెల్లడించారు. ఉక్రెయిన్ లోపల దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అంచనా వేశారు. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

12:33 March 11

పశ్చిమ ఉక్రెయిన్​లోని ఇవానో ఫ్రాంకిస్క్​, లుట్సక్​ నగరాల విమానాశ్రయాలపై రష్యా దాడులు చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే రష్యా అసలు టార్గెట్ ఇది కాదని, వేరో ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలంతా సైరన్ మోగాక సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. సుదూర పశ్చిమ ప్రాంతాల్లోనూ రష్యా ఇలాంటి చర్యలకు పాల్పడం వల్ల యుద్ధం మరో రూపు సంతరించుకుంటుందని వారు అన్నారు.

10:39 March 11

దేశం వీడిన 10 లక్షల మంది చిన్నారులు

రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్​ నుంచి 10 లక్షల మంది చిన్నారులు వెళ్లి పోయారని యూనిసెఫ్ వెల్లడించింది.

10:24 March 11

రష్యా భీకర దాడులతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్​కు అమెరికా సాయం అందించనుంది. ఇందుకోసం రూపొందించిన 13.6బిలియన్​ డాలర్లు కేటాయించేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. రిపబ్లికన్లు కూడా ఇందుకు మద్దతు తెలపడం వల్ల 68-31 ఓట్ల తేడాతో మొత్తం 1.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి సెనేట్​ ఆమోదం లభించింది.

13.6 బిలియన్ల ద్వారా ఉక్రెయిన్​కు ఆయుధ, మానవతా, ఆర్థిక సహకారం అందించనుంది అమెరికా. తన బలగాలను ఉక్రెయిన్ సరిహుద్దు దేశాలకు తరించేందుకు ఈ నిధులను ఉపయోగించనుంది.

08:32 March 11

ఉక్రెయిన్​కు మరో 50మిలియన్​ డాలర్ల సాయం: అమెరికా

రష్యా సైనిక చర్యతో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్​కు మరోమారు సాయం ప్రకటించింది అమెరికా. ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం ద్వారా 50 మిలియన్​ డాలర్లను మానవతా సాయం కింద అందిస్తున్నట్లు ప్రకటించారు అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​.

మరోవైపు.. రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రముఖ సంస్థ సోనీ మ్యూజిక్​ ప్రకటించింది.

రష్యాపై విమర్శలకు ఆంక్షలు సడలించిన ఫేస్​బుక్​

ఉక్రెయిన్​పై భీకర దాడుల నేపథ్యంలో రష్యాపై వివాదస్పద పోస్టుల నియంత్రణపై ఆంక్షలను సడలించింది ఫేస్​బుక్​. రష్యాకు వ్యతిరేకంగా చేసే పోస్టుల్లో ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, పౌరులకు సామాన్య ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు అనుమతించబోమని వెల్లడించింది.

06:55 March 11

ఉక్రెయిన్ నగరాల నుంచి రెండు రోజుల్లోనే లక్ష మంది సురక్షితంగా తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నట్లు అధ్యక్షుడు జెలెన్​స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్​లోని 280కిపైగా విద్యా సంస్థలపై రష్యా దాడులు చేసి ధ్వసం చేసిందని అక్కడి వార్తా సంస్థ తెలిపింది.

మరోవైపు చొర్నోబిల్ అణుకేంద్రంతో తమ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఇంటర్నేషనల్​ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి(IAEA) ఉక్రెయిన్ తెలియజేసింది. రష్యా నియంత్రణలో ఉన్న ఈ కేంద్రం నుంచి బాహ్య విద్యుత్ సరఫరాలు నిలిచిపోయిన మర్నాడు IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో ​​గ్రాస్సీని ఈ ట్వీట్ చేశారు.

తమపై రష్యా చేస్తున్న దాడిని ఉగ్రవాద యుద్ధంగా అభివర్ణించారు రష్యా రక్షణమంత్రి ఒలెస్కీ రెజ్నికోవ్. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సైనికలు కంటే సాధారణ పౌరులనే ఎక్కువగా హతమార్చాయని చెప్పారు.

06:52 March 11

రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్​తో భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్ పూరి ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వం వెల్లడించింది. ఇంధనం, శక్తి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించినట్లు పేర్కొంది.

06:46 March 11

అంతర్జాతీయ సహకారం అవసరం..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రభావితమైన వారందరికీ అంతర్జాతీయ సహకారం, మద్దతు అవసరమని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ అన్నారు. ఐరాస జరనల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రపంచ శ్రేయస్సకు శాంతి అంత్యత కీలకమన్నారు. ఐరాస కూడా అందుకే ఏర్పాటు అయిందని పేర్కొన్నారు.

06:26 March 11

రష్యా-ఉక్రెయిన్​ మధ్య కొలిక్కిరాని చర్చలు- ఆగని దాడులు

యుద్ధం నిలిపివేతపై ఉక్రెయిన్‌, రష్యా మధ్య గురువారం జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి రాలేదు. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య టర్కీలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దాడుల విరమణ, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు వీలుగా కారిడార్‌ల ఏర్పాటుపై ఇద్దరూ చర్చించారు. యుద్ధాన్ని విరమించడానికి రష్యా సిద్ధంగా లేదని, తాము లొంగిపోవాలని భావిస్తోందని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. అయితే అది జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. అటు ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. మరియుపోల్‌లో ఓ ఆసుపత్రిపై జరిపిన దాడిలో ఒక బాలిక సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి యుద్ధనేరం అని ఉక్రెయిన్‌ అభివర్ణించింది. జైతోమిర్‌ నగరంలో కూడా రెండు ఆసుపత్రులపై దాడులు జరిగాయి. మరియుపోల్‌లో చిక్కుకుపోయిన ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్నారు. విద్యుత్‌, ఫోన్‌ సర్వీసులు నిలిచిపోయాయి. రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 1300 మంది చనిపోయారని ఉక్రెయిన్‌ ప్రభుత్వం తెలిపింది.

Last Updated : Mar 12, 2022, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.