ETV Bharat / international

ఉక్రెయిన్​లో ఎమర్జెన్సీ- రష్యాపై మరిన్ని దేశాల ఆంక్షలు - ఆంక్షళు

Ukraine crisis: సరిహద్దుల్లో రష్యా దూకుడుగా ప్రవర్తిస్తున్న క్రమంలో అప్రమత్తమైంది ఉక్రెయిన్​. ఎలాంటి పరిస్థితులకు భయపడేది లేదని చెప్పిన ఆ దేశం అందుకు తగినట్లుగా సిద్ధమవుతోంది. తాజాగా దేశంలో అత్యవసర పరిస్థితి విధించేందుకు.. ఆ దేశ భద్రతా మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు.. రష్యాపై మరిన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

Ukraine crisis
వ్లాదిమిర్​ పుతిన్​
author img

By

Published : Feb 23, 2022, 5:13 PM IST

రష్యా మరింత దూకుడు పెంచిన క్రమంలో అప్రమత్తమైంది ఉక్రెయిన్. ఇప్పటికే.. దేశంలోని రిజర్వ్ భద్రతాబలగాలను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. రష్యా నుంచి ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించేందుకు సిద్ధమైంది. దేశంలో ఎమర్జెన్సీ విధించే ప్రణాళికకు ఉక్రెయిన్​ భద్రతా మండలి ఆమోదం తెలిపింది.

దొనెట్స్క్​, లుహాన్స్క్​ ప్రాంతాలు మినహా ఉక్రెయిన్​ మొత్తం అత్యవసర పరిస్థితి విధించనున్నట్లు ఆదేశ భద్రతా విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుమారు 30 రోజుల పాటు ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని, అవసరమైతే మరో 30 రోజులు పొడగించొచ్చని చెప్పారు.

రష్యాపై మరిన్ని దేశాల ఆంక్షలు..

ఇప్పటికే అమెరికా, బ్రిటన్​ సహా పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరిన్ని దేశాలు చేరాయి. దౌత్యపరంగా చర్చల ద్వారా సమస్య పరష్కారానికి రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

జపాన్​ ఆంక్షలు..

రష్యాతో పాటు స్వతంత్ర ప్రాంతాలుగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ గుర్తించిన ఉక్రెయిన్​లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలే లక్ష్యంగా ఆంక్షలు విధించారు జపాన్​ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా. ఉక్రెయిన్​కు వ్యతిరేకంగా రష్యా చేపడుతున్న చర్యలకు ప్రతిస్పందనగా.. రష్యా ప్రభుత్వ బాండ్ల జారీ, పంపిణీని జపాన్​లో నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉక్రెయిన్​లోని రెండు రెబల్​ ప్రాంతాలకు సంబంధించిన వారికి వీసాల జారీని సైతం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతాలతో వాణిజ్యాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్​ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తున్న రష్యా తీరును ఖండిస్తున్నట్లు ఉద్ఘాటించారు.

ఆర్థిక ఆంక్షలు..

రష్యా భద్రతా మండలికి చెందిన 8 మంది సభ్యుల ప్రయాణాలపై నిషేధంతో పాటు ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి. దీని ద్వారా రోసియా బ్యాంక్​, ప్రోమ్స్​వ్యాజ్​ బ్యాంక్​, ఐఎస్​ బ్యాంక్​, జెన్​బ్యాంక్​, బ్లాక్​ సీ బ్యాంక్​ ఫర్​ డెవలప్​మెంట్​, రీకన్​స్ట్రక్షన్​లతో ఆస్ట్రేలియా వ్యక్తులు, సంస్థలు వ్యాపార లావాదేవీలు జరపలేవని స్పష్టం చేశారు.

రష్యాపై ఆంక్షలు స్వాగతిస్తున్నాం: పోలాండ్​

రష్యా నుంచి వచ్చే గ్యాస్​ పైప్​లైన్​ నార్డ్​ స్ట్రీమ్​ 2 పనులను నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించటాన్ని స్వాగతించారు పోలాండ్​ నేతలు. ఉక్రెయిన్​పై రష్యా చర్యలకు వ్యతిరేకంగా మరిన్ని ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందన్నారు. గ్యాస్​ పైప్​లైన్​ ప్రాజెక్టును హానికరమైన, ప్రమాదకరమైన భౌగోళిక రాజకీయ ప్రాజెక్టుగా అభివర్ణించారు పోలిష్​ ప్రధాని మాట్యూస్జ్​ మొరావికీ.

ఏకాకిని చేయటమే లక్ష్యంగా..

తూర్పు ఐరోపా​లోకి మరిన్ని అదనపు బలగాలను పంపిస్తున్నట్లు ప్రకటించారు కెనడా ప్రధానమంత్రి జస్టిన్​ ట్రూడో. ఉక్రెయిన్​ వ్యవహారంలో రష్యాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు.

ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించటమే: ఐరాస

ఇటీవలి కాలంలో ప్రపంచం అతిపెద్ద శాంతిభద్రతల సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​. ఉక్రెయిన్​ తూర్పు ప్రాంతంలోని రెండు ప్రాంతాలకు స్వాంతంత్ర్యం ప్రకటించటాన్ని ఆదేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించటమేనని అభివర్ణించారు. శాంతి పరిరక్షణ పేరుతో వక్రబుద్ధిని రష్యా అవలంబిస్తోందని ఆరోపించారు.

రష్యా మంత్రితో భేటీ రద్దు..

ఉక్రెయిన్​లోని వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించటాన్ని తప్పుపట్టారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​. ఈ వారంలో ఆ దేశ విదేశాంగ మంత్రితో సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.

భారత్​ వైఖరిని స్వాగతించిన రష్యా..

ఉక్రెయిన్​ సంక్షోభంపై భారత్ అవలంబిస్తున్న స్వతంత్ర వైఖరిని రష్యా స్వాగతించింది. యూఎన్​ భద్రతా మండలిలో ఈ అంశంపై భారత్​ అభిప్రాయాలు రెండు దేశాల మధ్య ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. ఒక అంతర్జాతీయ శక్తిగా భారత్​ కీలక పాత్రను పోషిస్తోందని రష్యన్​ డిప్యూటీ చీఫ్​ ఆఫ్​ మిషన్​ రోమన్​.. బాబుష్కిన్​. అంతర్జాతీయ వ్యవహారాలపై స్వతంత్ర, సమతుల్య విధానాన్ని అనుసరిస్తోందన్నారు.

ఇదీ చూడండి: 'రంగంలోకి ఉక్రెయిన్ రిజర్వ్ బలగాలు.. అవసరమైతే ప్లాన్​-బీ అమలు'

రష్యాలోని ప్రముఖ బ్యాంకులపై అమెరికా ఆంక్షలు

రష్యా బయట బలగాల వినియోగానికి చట్టసభ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.