ETV Bharat / international

వ్యాక్సిన్ సర్టిఫికెట్​​ కోసం నకిలీ భుజం సృష్టించి.. అడ్డంగా బుక్కై... - Covid Green Pass Italy

Fake Arm for Vaccine: కరోనా నుంచి రక్ష.. టీకానేనని వైద్య నిపుణులు పదే పదే చెబుతూనే ఉన్నారు. ఆసక్తి లేని కొందరు.. వ్యాక్సిన్​ తీసుకోవట్లేదు. కానీ.. ఇక్కడో వ్యక్తి మాత్రం వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ కోసం ఆరోగ్య సిబ్బందినే మోసం చేశాడు. ఏకంగా నకిలీ భుజాన్నే సృష్టించుకొని టీకా తీసుకోబోగా బండారం బయటపడింది. అసలేమైందంటే?

Italian dentist presents fake arm for vaccine to get pass
నకిలీ భుజానికి టీకా తీసుకుంటూ
author img

By

Published : Dec 4, 2021, 5:34 PM IST

Fake Arm for Vaccine: అతడు ఓ దంత వైద్యుడు. వ్యాక్సిన్​ తీసుకోనందుకు ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి సస్పెండ్​ చేశారు అధికారులు. టీకా వేసుకోవడం ఇష్టం లేని ఆ వ్యక్తి.. వ్యాక్సిన్​ సర్టిఫికెట్ ఎలాగైనా పొందేందుకు​ ఓ ప్లాన్​ వేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇటలీలోని బియెల్లాలో జరిగిందీ ఘటన.

ఆరోగ్య సిబ్బంది కచ్చితంగా వ్యాక్సిన్​ తీసుకోవాలన్న నిబంధన ఇటలీలో అమల్లో ఉంది. సంబంధిత వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ను చూపిస్తేనే ఉద్యోగం ఉంటుంది.

కానీ.. టీకా తీసుకోవడం ఇష్టం లేక సస్పెండ్​ అయిన ఓ ఆరోగ్య కార్యకర్త వినూత్నంగా ఆలోచించాడు. భుజం చుట్టూ సిలికాన్​తో చేసిన నకిలీ భుజాన్ని అతికించుకొని టీకా వేయించుకునేందుకు వెళ్లాడు.

నర్స్​ చొక్కా ఎత్తి వ్యాక్సిన్​ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె చేతికి అతడి భుజం రబ్బర్​లాగా, చల్లగా తగిలింది. అనుమానంతో అక్కడ ఇంకాస్త గట్టిగా రుద్దగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం బయటకు పొక్కకుండా నర్స్​ను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె అధికారులకు ఫిర్యాదు చేసింది.

Dentist in Italy faces Possible Criminal Charges

అతడు చేసిన పనికి.. అధికారులు నివ్వెరపోయారు. పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఇటలీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆంక్షలు కఠినతరం చేసింది అక్కడి ప్రభుత్వం.

Covid Green Pass Italy

  • డిసెంబర్​ 6 నుంచి ఇటాలియన్లకు కొవిడ్​ గ్రీన్​ పాస్​ తప్పనిసరి.
  • కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్​ వేసుకున్నవారికి మాత్రమే ఇది లభిస్తుంది.
  • రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, జిమ్​లు, స్విమ్మింగ్​ పూల్స్​కు వెళ్లాలంటే ఇది చూపించాల్సిందే.

ఇవీ చూడండి: ఒమిక్రాన్​పై టీకాలు పని చేస్తాయా? నిపుణుల మాటేంటి?

Corona Vaccine: ఫొటోకు ఫోజు ఇస్తూ.. ముందే టీకా వేసిన విషయాన్ని మరిచి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.