ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 31 లక్షలు దాటిన కరోనా కేసులు - Global COVID-19 trackers

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 31 లక్షల 36 వేలు దాటింది. ఇప్పటివరకు 2 లక్షల 17 వేల మందికిపైగా మరణించారు. కొవిడ్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 10 లక్షలకు చేరువైంది. అమెరికాలో వైరస్​ విజృంభిస్తోంది. బ్రెజిల్​, రష్యా, యూకే, పెరూ, ఈక్వెడార్​ వంటి దేశాల్లో రోజూ వేలాది కరోనా బారినపడుతున్నారు.

Global COVID-19 trackers
ప్రపంచవ్యాప్తంగా 31 లక్షలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Apr 29, 2020, 7:04 AM IST

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. అమెరికాలో కొత్తగా 25 వేలపైగా మందికి కరోనా సోకింది. అగ్రరాజ్యంలో వైరస్‌ బాధితుల సంఖ్య 10 లక్షల 35 వేలు దాటింది. 59 వేల మందికిపైగా చనిపోయారు. 24 గంటల వ్యవధిలోనే 2,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షా 42 వేల మందికిపైగా కోలుకున్నారు.

  • స్పెయిన్‌లో కొత్త కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 2 లక్షల 32 వేలు దాటింది. మృతుల సంఖ్య 23 వేల 822కు చేరింది.
  • ఇటలీలో కేసులు 2 లక్షలను అధిగమించాయి. 27 వేల 359 మంది మృతిచెందారు. ఫ్రాన్స్‌లో కొవిడ్‌ బాధితుల సంఖ్య లక్షా 65 వేల 842కు చేరగా, 23 వేల 660 మంది మరణించారు.
  • జర్మనీలో మొత్తం కేసులు లక్షా 59 వేల 431 కాగా, 6వేల 215 మంది మృతి చెందారు.
  • బ్రిటన్‌లో కరోనా బాధితులు లక్షా 31 వేల 145కి చేరగా, 21వేల 648 మంది మృత్యువాతపడ్డారు.

మిగతా దేశాల్లో...

టర్కీలో లక్షా 14వేల 653 కేసులు నమోదు కాగా, 2 వేల 992 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కొవిడ్‌కేసులు 93 వేలు దాటాయి. మృతుల సంఖ్య 867కు పెరిగింది. ఇరాన్‌లో 92 వేల 584 మందికి వైరస్‌సోకగా......72 వేల మందికిపైగా కోలుకున్నారు. 5 వేల 877 మంది మృతిచెందారు.

బ్రెజిల్​పై దాడి..

కరోనాకు సరికొత్త హట్‌స్పాట్‌గా మారుతున్న బ్రెజిల్‌లో మొత్తం కేసులు 72 వేలు దాటగా.. చేరగా 5 వేల 60 మంది చనిపోయారు. 24 గంటల వ్యవధిలో అక్కడ 520 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

బెల్జియంలో కరోనా కేసులు 47 వేల 334కు చేరగా 7వేల 331 మంది మరణించారు. నెదర్లాండ్స్‌, స్వీడన్‌, మెక్సికోలో వందల సంఖ్యలో కేసులు, పదుల సంఖ్యలో మరణాలు కొనసాగుతున్నాయి.

సౌదీ అరేబియాలో కరోనా కేసులు 20వేలు దాటగా 152 మంది చనిపోయారు. యూఏఈలో కొవిడ్‌ బాధితులు 11వేల 380కి చేరగా 89మంది చనిపోయారు. సింగపూర్‌లో మొత్తం కేసులు 15 వేలకు చేరగా మృతులసంఖ్య 14గానే ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వ్యాధిబారిన పడినవారి సంఖ్య తక్కువగానే ఉండగా వారిలో 80శాతానికిపైగా కోలుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.