కరోనా విజృంభణ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (హెల్త్ ఎమర్జెన్సీ) పొడిగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. జులై 24 వరకు పొడిగిస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఒలివియర్ వెరన్ వెల్లడించారు.
ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు లక్షా 67 వేల 346 మందికి వైరస్ సోకింది. 24,594 మంది మృతి చెందారు. 50,212 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.