ETV Bharat / international

సోదరుడికి సారీ చెప్పిన కుక్క- వీడియో వైరల్​ - dog watson apologises to brother kiko

ప్రేమ, ఆప్యాయత చూపించడం, అలగడం, హగ్​ చేసుకోవడం మనుషులకేనా... మాకూ తెలుసు అంటున్నాయి రెండు కుక్కలు. తాజాగా ఓ శునకం తన సోదరుడికి సారీ చెప్పిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

dog sorry for another dog by hugging
సోదరుడికి సారీ చెప్పిన కుక్క.. వీడియో వైరల్​
author img

By

Published : Jun 28, 2020, 4:22 PM IST

ఇంట్లో ఉంటే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఏం చేస్తారు? కలిసి సరదాగా గడపడమో లేక గిల్లికజ్జాలు పెట్టుకోవడమో చేస్తారు. ఒకరి చాక్లెట్లు, బిస్కెట్లు మరొకరు తినేయడం, ఒకరి వస్తువులు మరొకరు విరగొట్టేయడం వంటి పనులు చేస్తుంటారు. అయితే వారిని ఇంట్లో పెద్దవారు తిట్టో, రెండు దెబ్బలు కొట్టో చక్కదిద్దుతారు. అయితే మనుషుల్లానే కుక్కల్లోనూ ఈ చిలిపి చేష్టలు ఉంటాయనుకుంట. తాజాగా ఓ రెండు కుక్కలు తమ మధ్య ఆప్యాయత ప్రదర్శించి నెటిజన్ల మనసు దోచేస్తున్నాయి.

కికో, వాట్సన్ అనే రెండు గోల్డెన్​ రిట్రీవర్​ జాతి కుక్కలు.. తమ యజమానురాలు పెట్టిన చికెన్​ ముక్కలు తింటున్నాయి. అయితే వాట్సన్‌కు ఆకలి తీరలేదో, ఏడిపించాలనో కికోకు వేసిన ఓ చికెన్​ పీస్​ను లాగించేసింది. అది చూసిన యజమానురాలు వాట్సన్​ను హెచ్చరించింది. తమ్ముడి చికెన్​ తిన్నందుకు సారీ చెప్పు అనగానే.. కికో దగ్గరకు వెళ్లిన వాట్సన్​ రెండు చేతులతో దాన్ని హగ్​ చేసుకుంది. ఈ వీడియోను ప్రస్తుతం సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. బాలీవుడ్​ నటి రిచా చద్ధా, సింగర్​ జస్లీన్​ రాయల్​ వంటి ప్రముఖులు ఈ వీడియో షేర్​ చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.