ETV Bharat / international

ప్రపంచంపై కొవిడ్ పంజా- కోటి 10 లక్షల కేసులు - death toll raises to 5.24 lakhs

మానవాళిపై కరోనా పంజా విసురుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య కోటి 10 లక్షలు దాటింది. దక్షిణాఫ్రికాలో వైరస్ ప్రభావం తీవ్రమవుతోంది. అమెరికాలో తీవ్రత కొనసాగుతుండగా.. అతిచిన్న దేశం పరాగ్వే వైరస్​ను విజయవంతంగా నియంత్రిస్తోంది. మరోవైపు ఆంక్షలు సడలించేందుకు సిద్ధమైంది యూకే.

coronavirus cases surpasses 1 crore 10 lakh globally, death toll raises to 5.24 lakhs
ప్రపంచంపై కొవిడ్ పంజా- కోటి 10 లక్షల కేసులు
author img

By

Published : Jul 3, 2020, 8:21 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. పలు దేశాల్లో వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి 10 లక్షలు దాటింది. ఇప్పటివరకు 5,24,881 మంది వైరస్ బారిన పడి​ ప్రాణాలు కోల్పోయారు. 61,78,566 మంది ఇన్ఫెక్షన్​ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 43,20,010 యాక్టివ్ కేసులున్నాయి.

అగ్రరాజ్యం..

అత్యధికంగా అమెరికాలో 28 లక్షల కేసులు నమోదయ్యాయి. లక్షా 31 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 11.91 లక్షల మంది వైరస్​నుంచి కోలుకున్నారు. మరో 15.14 లక్షల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పిలుపునిచ్చారు. వారాంతపు సెలవుల్లో సాంప్రదాయ వేడుకలు నిర్వహించొద్దని కోరారు.

మాస్కులు ధరించే విషయంలో కాలిఫోర్నియా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు క్రిమినల్ చర్యలు చేపడతామని దాదాపు 3.5 లక్షల మంది వ్యాపారులకు లేఖ రాశారు.

దక్షిణాఫ్రికా..

దక్షిణాఫ్రికాలో కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ప్రత్యేక వార్డులతో పాటు సాధారణ వార్డుల్లోనూ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వసతుల లేమితో పలు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

లాక్​డౌన్ సడలించడం వల్ల కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. కొద్దిరోజులుగా కేప్​టౌన్​లో వైరస్ విజృంభన కొనసాగగా... ప్రస్తుతం జొహనస్​బర్గ్​లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో జొహనస్​బర్గ్​లో మళ్లీ ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. అధిక వేగంతో వ్యాపిస్తున్న వైరస్​ను అడ్డుకోవడానికి అదే ప్రత్యామ్నాయమని పేర్కొంటున్నారు.

కరోనా కారణంగా దేశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా పేర్కొన్నారు. కరోనా తీసుకొచ్చిన సవాళ్లకు పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షా 60 వేలు దాటాయి. 2,800 మందికిపైగా మరణించారు. తీవ్రమైన చలి వాతావరణం ఉండటం వల్ల రెండువారాలకు ఒకసారి కేసులు రెట్టింపు అవుతున్నట్లు అధికారులు తెలిపారు.

సియోల్​లో మళ్లీ..

దక్షిణ కొరియాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 63 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 12,967కి చేరింది. మరణాల సంఖ్య 282గా ఉంది.

కొత్త కేసుల్లో దాదాపు సగం రాజధాని సియోల్ ప్రాంతంలోనే గుర్తించారు అధికారులు.

పేద దేశ విజయం!

కరోనా నియంత్రణలో పరాగ్వే విజయం సాధిస్తోంది. నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ వైరస్​ను కట్టడి చేస్తోంది. మిలిటరీ అకాడమీలు, మత ప్రార్థనా స్థలాల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశానికి వచ్చే వారిని తప్పని సరిగా 14 రోజులు నిర్బంధంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటోంది. వరుసగా రెండు పరీక్షల్లో కరోనా నెగెటివ్ వస్తే తప్ప వారిని దేశంలో తిరగనివ్వకుండా జాగ్రత్త పడుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ... సరిహద్దులు మూసేసింది.

ఇప్పటివరకు ఈ దేశంలో కేవలం 2,303 కేసులు నమోదయ్యాయి. 19 మంది కరోనాకు బలయ్యారు.

యూకే..

వైరస్ ప్రభావం అంతగా లేని దేశాల ప్రయాణికులకు పలు మినహాయింపులు ఇచ్చింది యునైటెడ్ కింగ్​డమ్. కరోనా ముప్పు తక్కువగా ఉన్న ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ వంటి తదితర దేశాల వారికి 14 రోజుల క్వారంటైన్ నిబంధనను రద్దు చేస్తున్నట్లు ప్రటించింది. జులై 10 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది.

ఐరోపాలో అత్యధిక కేసులు బ్రిటన్​లోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు 283,757 మందికి వైరస్ సోకింది. దాదాపు 44 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. దేశంలో లాక్​డౌన్ ఆంక్షలను సడలిస్తోంది యూకే. బార్లు, రెస్టారెంట్లు, హెయిర్​సెలూన్లను శనివారం నుంచి పునఃప్రారంభించనుంది.

పాకిస్థాన్

పాకిస్థాన్​లో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు మొత్తం 2,21,000 మంది వైరస్​ బారిన పడ్డారు. ఇందులో 1,13,623 మంది కోలుకోగా.. 4,551 మంది మరణించారు. సింధ్, పంజాబ్, ఖైబర్-పఖ్తుంఖ్వా రాష్ట్రాల్లో వైరస్ తీవ్రంగా ఉంది.

మరోవైపు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంత్రికి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు

కరోనా నేపథ్యంలో పేద కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ ద్వారా 1.23 కోట్ల కుటుంబాలను ఆదుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతీ కుటుంబానికి రూ.12 వేలను అందించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: తమిళనాట లక్ష దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.