ETV Bharat / international

ప్యారిస్​లో మళ్లీ కత్తి దాడులు- నలుగురికి గాయాలు - చార్లీ హెబ్డో కార్యాలయం సమీపంలో కత్తిదాడులు

ప్యారిస్​లో మరోసారి కత్తి దాడులు కలకలం సృష్టించాయి. వ్యంగ్య వార్తా పత్రిక.. ఛార్లీ హెబ్డో పాత కార్యాలయానికి సమీపంలో దుండగులు ఈ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

knife attack near ex Charlie Hebdo former office
చార్లీ హెబ్డో కార్యాలయం సమీపంలో కత్తిదాడులు
author img

By

Published : Sep 25, 2020, 5:31 PM IST

ఫ్రాన్స్​ రాజధాని ప్యారిస్​లో దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. వ్యంగ్య వార్తా పత్రిక చార్లీ హెబ్డో పాత కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడ్డ దుండగులు పరారీలో ఉన్నట్లు ప్యారిస్ పోలీసులు తెలిపారు.

ఈ దాడికి అసలు కారణం ఏమిటనేది తెలియలేదు. చార్లీ హెబ్డో పత్రిక ఉద్యుగులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందా అనే విషయంపైనా స్పష్టతలేదు.

2015లో ఉగ్రవాదులు.. పత్రిక సిబ్బందిపై దాడికి తెగబడి 12 మందిని పొట్టన బెట్టుకున్నారు. ఈ ఘటన అనంతరం సంస్థ తన కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించింది.

ఇదీ చూడండి:ఇక విదేశీ యుద్ధాలకు అమెరికా స్వస్తి: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.