అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో టిబెట్‌లోని న్యింగ్చీ పట్టణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటించారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకు చైనా నాయకులు మాత్రమే సందర్శించారు. అనూహ్యంగా ఇప్పుడు జిన్‌పింగ్ ఇక్కడ పర్యటించడం చర్చనీయాంశమైంది.
బుధవారం ఉదయం న్యింగ్చీ చేరుకున్న జిన్‌పింగ్‌కు స్థానిక ప్రజలు, సంప్రదాయ తెగలు, అధికారులు సాదర స్వాగతం పలికినట్లు జినువా వార్తా సంస్థ పేర్కొంది.
పర్యటనలో భాగంగా న్యాంగ్ నది వంతెనను జిన్‌పింగ్ సందర్శించారు. బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో పర్యవరణ పరిరక్షణను పరిశీలించారు.
అరుణాచల్ ప్రదేశ్.. దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా చాలా ఏళ్లుగా వాదిస్తోంది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖపై భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం నెలకొంది.
గత కొన్ని సంవత్సరాలలో టిబెట్ సరిహద్దులో చైనా అధ్యక్షుడు అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. చైనా జూన్‌లో తన మొదటి బుల్లెట్ రైలు సేవలను ఇక్కడ ప్రారంభించినప్పుడు న్యింగ్చీ పట్టణం వార్తల్లో నిలిచింది.
ఇదీ చూడండి: భారత్-చైనా మధ్య త్వరలోనే 12వ విడత చర్చలు!