కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా కల్పితమని ల్యాబ్ డైరక్టర్ వాంగ్ యానీ స్పష్టంచేశారు. కరోనా వైరస్ ప్రబలే వరకు దాని ఉనికే తమకు తెలియదన్నారు. ఆ వైరస్‌పై ఎప్పుడూ పరిశోధన కూడా చేయలేదని చెప్పుకొచ్చారు వాంగ్. తమ దగ్గర వైరస్ లేనప్పుడు ఎలా బయటపడుతుందని ప్రశ్నించారు. అసలు అలాంటి వైరస్ ఒకటి ఉందని కూడా తమకు తెలియదన్నారు.
అయితే కరోనా ఆ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ వైరస్‌కు మూలం గబ్బిలాలే అని, వాటి నుంచి కొన్ని మధ్యవర్తి జీవుల ద్వారా మానవులకు సోకిందని అనేక మంది శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి: కరోనా పుట్టుకపై ఎన్నెన్నో ఊహ'న్'లు!