ETV Bharat / international

Taliban news: తాలిబన్ల పాలనలో తప్పులు చేస్తే ఇలాంటి శిక్షలా.. - అఫ్గానిస్థాన్​

అఫ్గానిస్థాన్​లోని(Taliban news) హెరాత్​ నగరంలో వ్యాపారిని కిడ్నాప్​ చేసిన వారికి కఠిన శిక్షను అమలు చేశారు తాలిబన్లు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురిని కాల్చిచంపారు(Afghanistan crime news). అనంతరం వారిలో ఒకరి మృతదేహాన్ని నగరంలోని ప్రధాన కూడలి వద్ద క్రేన్​కు వేలాడదీశారు. 1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు ఉంటాయని తాలిబన్​ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా తురాబీ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ ఘటన వెలుగుచూసింది.

taliban
తాలిబన్​
author img

By

Published : Sep 25, 2021, 5:19 PM IST

Updated : Sep 25, 2021, 8:00 PM IST

తాలిబన్ల పాలనలో తప్పులు చేస్తే ఇలాంటి శిక్షలా...

అఫ్గానిస్థాన్‌లో దోషులకు కఠినమైన(Afghanistan crime news) శిక్షలు అమలు చేస్తామని తాలిబన్‌ నేత ప్రకటించిన కొద్ది గంటల్లోనే క్రూరమైన ఘటన చోటుచేసుకుంది (Taliban news)). హెరాత్‌ నగరంలో వ్యాపారిని కిడ్నాప్‌ చేసిన ఘటనలో నలుగురిని తాలిబన్లు కాల్చిచంపారు. అనంతరం అందులోని ఒక వ్యక్తి మృతదేహాన్ని నగరంలోని ప్రధాన కూడలి వద్ద క్రేన్‌కు బహిరంగంగా వేలాడదీసినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మిగిలిన 3 మృతదేహాలను ఇతర కూడళ్లకు తరలించినట్లు వెల్లడించారు(Taliban Afghanistan news).

'కాళ్లు, చేతులు నరికే శిక్షలు మళ్లీ వస్తాయ్​..'

ఒకప్పటిలా క్రూర విధానాలను ఈ దఫా పాలనలో అనుసరించబోమని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన తాలిబన్లు (Afghanistan Taliban) ఇప్పుడు మాట మార్చారు! అఫ్గానిస్థాన్‌లో (Afghanistan latest news)1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు (Taliban rules for Afghanistan) అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

తాలిబన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్‌ తురాబీ (Mullah Nooruddin Turabi) ఇటీవలే ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. "గతంలో మేం బహిరంగంగా శిక్షలను అమలు చేసినప్పుడు చాలా దేశాలు విమర్శలు గుప్పించాయి. కానీ మేమెప్పుడూ ఆయా దేశాల చట్టాలు, శిక్షల గురించి మాట్లాడలేదు. మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. మా చట్టాలు ఎలా ఉండాలో ఇతరులు చెప్పనక్కర్లేదు. మేం ఇస్లాంను అనుసరిస్తాం. ఖురాన్‌ ప్రకారమే చట్టాలు(Taliban punishment in Afghanistan) రూపొందించుకుంటాం. గత పాలన తరహాలోనే ఇప్పుడు కూడా దోషులను కఠినంగా శిక్షిస్తాం. చేతులు, కాళ్లు నరకడం వంటి శిక్షలను అమలు చేస్తాం. అయితే వాటిని బహిరంగంగా అమలు చేయాలా వద్దా అన్న దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి" అని పేర్కొన్నారు.

తాలిబన్ల గత ప్రభుత్వంలో(Taliban ruling Afghan) తురాబీ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో అఫ్గాన్‌లో (Afghanistan Taliban) హంతకులను బహిరంగంగా కాల్చిచంపడం, దొంగల కాళ్లు-చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో ఉండేవి.

అటు విద్యపరంగానూ తాలిబన్లు గత పాలనను గుర్తుచేస్తున్నారు. అబ్బాయిలను స్కూళ్లకు అనుమతిస్తూనే అమ్మాయిలపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అటు కాబుల్​లో మహిళా ఉద్యోగులు ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశాలిచ్చారు. అటు కేబినెట్​లో మహిళలకు అవకాశం ఇవ్వాలన్న అభ్యర్థనలను కూడా తాలిబన్లు లెక్కచేయలేదు. పురుషులతో కూడిన పూర్తిస్థాయి ఆపద్ధర్మ కేబినెట్​ను ఇటీవలే ప్రకటించారు. తాలిబన్ల చర్యలపై అంతర్జాతీయ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇవీ చూడండి:-

Last Updated : Sep 25, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.