ETV Bharat / international

అధునాతన ఆయుధ తయారీలో చైనా దూకుడు.. టార్గెట్​ అమెరికానే - China vs US

స్టెల్త్ పరిజ్ఞానం కలిగిన ఆయుధాల అభివృద్ధిలో చైనా దూసుకెళ్తోంది. అగ్రరాజ్యంగా ఎదగాలని సంకల్పించుకున్న డ్రాగన్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఫైటర్ జెట్​లు, బాంబర్లు, మానవరహిత వాహనాలను శరవేగంగా సిద్ధం చేస్తోంది.

With stealth focus, China military steals a march

author img

By

Published : Nov 9, 2021, 7:46 AM IST

ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని ఊవిళ్లూరుతున్న చైనా.. అందుకు అనుగుణంగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. శత్రురాడార్ల కళ్లుగప్పే సాంకేతిక పరిజ్ఞానంతో (స్టెల్త్) కూడిన అధునాతన ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. అంతేకాకుండా ప్రస్తుతం తయారు చేసుకున్న ఆయుధాలకు మెరుగులను సైతం దిద్దుతోంది.

ఇటీవల చెంగ్డూ ఎయిర్​బేస్​లో కనిపించిన పీఎల్​ఏ ఎయిర్​ఫోర్స్ జే20 ఫైటర్ జెట్​ అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఫైటర్​జెట్లలో ఒక్క సీటే ఉంటుండగా.. జే20 కాక్​పిట్​లో మాత్రం రెండు సీట్లు ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఇది ట్రైనర్ జెట్ అన్న అనుమానాలను జే20 డిజైనర్ యాంగ్ వెయి సెప్టెంబర్​లోనే కొట్టిపారేశారు. దీంతో కో-పైలట్ స్థానం ఉపయోగంపై ఓ స్పష్టత వచ్చినట్లైంది.

ప్రధాన పైలట్ విమానం నడపడంపై ప్రధానంగా దృష్టిసారిస్తే... పేలోడ్​లు, ఆయుధ సంపత్తిని కో-పైలట్ నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక యుద్ధాలను పూర్తిగా మార్చేసే సత్తా ఈ ట్విన్ పైలట్ జెట్లకు ఉందని అంటున్నారు. అమెరికా చేతిలో ఉన్న ఎఫ్35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్, ఎఫ్22ఏ రాప్టార్​ల తర్వాత.. ప్రపంచంలో మూడో స్టెల్త్ ఫైటర్ జెట్ ఇదే కావడం విశేషం. ఇలాంటివి చైనా ఎయిర్​ఫోర్స్ వద్ద 150 వరకు ఉన్నాయి. మరిన్ని విమానాలనూ తయారు చేస్తోంది డ్రాగన్. భారీ స్థాయిలో వీటి ఉత్పత్తి ప్రారంభించిందని తెలుస్తోంది.

ఫైటర్ జెట్

మరోవైపు, ఎఫ్​సీ31 పేరుతో మరో స్టెల్త్ ఫైటర్ జెట్​ను అభివృద్ధి చేస్తోంది చైనా. ఇద్దరు పైలట్లు కూర్చునే సామర్థ్యంతో దీన్ని తయారు చేస్తోంది. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఈ విమానాలను.. నావికాదళం కోసం వినియోగించనుందని తెలుస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న విమాన వాహక నౌకలపై దీన్ని ఉపయోగించనుంది.

స్ట్రాటజిక్ బాంబర్

ఎఫ్​సీ31 స్ట్రాటజిక్ స్టెల్త్ బాంబర్ విమానాలను సైతం చైనా అభివృద్ధి చేస్తోంది. హెచ్20గా పిలుస్తున్న వీటిని.. అణ్వాయుధాలను మోసుకెళ్లేలా సిద్ధం చేస్తోంది. దీని పరిధి 8500 కిలోమీటర్లు కాగా.. 10 మెట్రిక్ టన్నుల బరువును మోసుకెళ్లగలదు. సంప్రదాయ ఆయుధాలను సైతం ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉంది.

అధునాతన యూఏవీ

స్టెల్త్ పరిజ్ఞానంతోనే మరో అధునాతన యూఏవీనీ తయారు చేస్తోంది డ్రాగన్. జీజే11 'షార్ప్ స్వార్డ్' పేరుతో నిర్మిస్తున్న దీని వివరాలను ఇటీవలే ప్రకటించింది చైనా. యూఏవీ రంగంలో అత్యాధునిక సాంకేతికతతో తయారవుతున్న ఆయుధం ఇదేనని తెలుస్తోంది. దీని రెక్కల వ్యాసం 14మీటర్లు. పరిధి 4వేల కిలోమీటర్లు. వెయ్యి కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈ డ్రోన్ దూసుకెళ్లగలదు. భారీ ఆయుధాలు, గురిచూసి కొట్టే గైడెడ్ ఆయుధాలను ఇది ప్రయోగించగలదు.

అమెరికా నివేదిక

తమ శక్తియుక్తులను గణనీయంగా పెంచుకోవాలని చైనా ప్రణాళికలు రచించిందని అమెరికా నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయి. సరికొత్త స్టెల్త్ స్ట్రాటజిక్ బాంబర్లను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోందని పెంటగాన్ ఇటీవల నివేదిక విడుదల చేసింది. 2016లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వీటి తయారీకి మరో దశాబ్దానికి పైగా సమయం పడుతుందని అంచనా వేసింది.

అతిపెద్ద ఎయిర్​ఫోర్స్, నేవీ..

చైనా ఎయిర్​ఫోర్స్, నేవీలకు కలిపి మొత్తం 2,250 యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇందులో ఫైటర్ జెట్లు, స్ట్రాటజిక్ బాంబర్లు, టాక్టికల్ బాంబర్లు, మల్టీమిషన్ టాక్టికల్ విమానాలు, ఎటాక్ ఎయిర్​క్రాఫ్ట్​లు ఉన్నాయి. ఇతర ప్రయాణ విమానాలను సైతం కలుపుకుంటే.. చైనా ఎయిర్​ఫోర్స్ ప్రపంచంలో మూడో అతిపెద్దది అవుతుంది.

చైనా పీఎల్​ఏఎన్... 355కు పైగా నౌకలు, సబ్​మెరైన్​లతో ప్రపంచంలోనే అతిపెద్ద నావికాదళాల్లో ఒకటిగా ఎదిగింది. 2025నాటికి వీటి సంఖ్యను 420కు, 2030 నాటికి 460కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.