ETV Bharat / international

ఫిలిప్పీన్స్​ను వణికిస్తోన్న 'వామ్కో' తుపాను - ఈశాన్య ఫిలిప్పీన్స్​లో 'వామ్కో' తుపాను బీభత్సం

ఫిలిప్పీన్స్​ను మరో తుపాను వణికిస్తోంది. 'గోని' విలయం నుంచి కోలుకోకముందే 'వామ్కో' రూపంలో ఆ దేశంలో మరో ముప్పు ఎదురైంది. ప్రమాదకర స్థాయిలో గంటకు 140కి.మీ-195 కి.మీ వరకు గాలులు వీస్తున్నాయి.

Rivers swell in typhoon-ravaged Manila
ఈశాన్య ఫిలిప్పీన్స్​లో 'వామ్కో' తుపాను బీభత్సం
author img

By

Published : Nov 12, 2020, 4:48 PM IST

ఈశాన్య ఫిలిప్పీన్స్​లో 'వామ్కో' తుపాను బీభత్సం సృష్టిస్తోంది. వరదల కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందారు. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు.

ఈశాన్య ఫిలిప్పీన్స్​ను వణికిస్తోన్న 'వామ్కో' తుపాను

తుపాను ధాటికి గురువారం గంటకు 140-195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈదురు గాలుల ప్రభావంతో ఉత్తర మనీలా, బులాకాన్, పంపాంగ రాష్ట్రాల్లో చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్​ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

2లక్షల మంది తరలింపు..

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ఇప్పటివరకు సుమారు 2లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలుచోట్ల సహాయక బృందాలు మోహరించాయి.

ఇదీ చదవండి: రాకెట్​ దాడిలో నలుగురు మహిళలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.