శత్రుదేశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చైనా మాస్టర్ ప్లాన్ రచించింది. దేశ వాయువ్య ప్రాంతంలో అమెరికా యుద్ధనౌకల నమూనాలను, వాటిని ధ్వంసం చేసేందుకు కావాల్సిన యంత్రాలను ఏర్పాటు చేసింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. భవిష్యత్తులో యుద్ధం వస్తే, సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు చైనా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను అమెరికా కొలరాడో ఆధారిత మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ బయటపెట్టింది.
వాయువ్య జిన్జియాంగ్లోని రుయేకియాంగ్ ప్రాంతంలో చైనా ఈ కార్యకలపాలు సాగిస్తున్నట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో చైనా తన సైనిక శక్తిని విపరీతంగా పెంచుకుంటోంది. దక్షిణ చైనా సముద్రం, తైవాన్, ఇండో-పెసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు సాధిస్తుండటం అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది. ఈ విషయాన్ని అనేకమార్లు బహిరంగంగానే వెల్లడించింది అమెరికా. ఈ తరుణంలో ఉపగ్రహ చిత్రాలు బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:'భారత్, తైవాన్‌పై చైనా గురి- ఏడాదిలో 250 క్షిపణి పరీక్షలు!'