Rohingya refugees sue Facebook: 2021 ఫిబ్రవరిలో జరిగిన మయన్మార్ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాలు పోస్టు కాకుండా అడ్డుకోవడంలో విఫలమైందని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై రొహింగ్యా శరణార్థులు 150 బిలియన్ డాలర్ల పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు న్యాయ కంపెనీలు ఎడల్సన్ పీసీ, ఫీల్స్, ఎల్‌ఎల్‌సీలు రొహింగ్యా శరణార్థుల తరుపున అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయస్థానంలో దావా వేశారు. ఫేస్‌బుక్‌లో పోస్టు అయిన ప్రసంగాలు తమపట్ల హంసకు కారణమయ్యాయని ఇందులో పేర్కొన్నారు.
Myanmar violence: అయితే ఫిబ్రవరి1న తిరుగుబాటు జరిగిన తరువాత మయన్మార్ సైన్యానికి సంబంధించి సమాచారం పోస్టుకాకుండా నిషేధం విధించడం సహా పలు కట్టడి చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. మూడో వ్యక్తి పోస్టు చేసిన సమాచారంపై చర్యలు చేపట్టకుండా అమెరికా అంతర్జాలం చట్టం ప్రకారం తమకు రక్షణ ఉందని స్పష్టం చేసింది. పిటిషన్‌దారులకు కోర్టులో విజయం దక్కక పోవచ్చని పలువురు నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ప్రకృతి ప్రకోపం.. మనిషి విధ్వంస సమాహారం.. 2021
ఇదీ చూడండి: జనవరి 1నుంచి నాలుగున్నర రోజులే పనిదినాలు!