ETV Bharat / international

చైనా ఆర్మీ వంటశాలల్లో రోబోల నియామకం! - చైనా సైన్యం వార్తలు

ఆహారం వృథాను అరికట్టేందుకు చైనా శ్రీకారం చుట్టిన క్లీన్​ ప్లేట్ ఉద్యమాన్ని సైన్యంలోనూ కఠినంగా అమలు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వంట పద్ధతుల్లో మార్పులతో పాటు సాంకేతికతను వినియోగించాలని ప్రణాళికలు వేస్తోంది.

President Xi
జిన్​పింగ్
author img

By

Published : Aug 21, 2020, 6:51 AM IST

ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ ప్రారంభించిన​ 'క్లీన్​ ప్లేట్'​ ఉద్యమాన్ని సైన్యానికి విస్తరించనున్నారు. చైనా మిలిటరీలోనూ ఆహార వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సాంకేతికత వినియోగంపై దృష్టి సారించింది పీపుల్స్​ లిబరేషన్ ఆర్మీ (పీఎల్​ఏ).

ఇందులో భాగంగా వంటగాళ్లుగా రోబోలను ప్రవేశపెట్టందుకు చైనా ప్రణాళికలు వేస్తోంది. అంతేకాకుండా ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రత్యేకమైన స్టవ్​లను అందించేందుకు సిద్ధం చేస్తోంది. ఏ ఆహారం తీసుకోవాలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

ఆహార విధానంలో సంస్కరణలు..

20 లక్షల మందితో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలం చైనా పీఎల్​ఏ సొంతం. ప్రజలతో పాటు సైన్యమూ ఆహార వృథాను అరికట్టాలని జిన్​పింగ్ ప్రభుత్వం యోచిస్తోందని చైనా అధికారిక మీడియా పీఎల్​ఏ డైలీ వెల్లడించింది.

"వంట, ప్రాసెసింగ్ పద్ధతులను మెరుగుపరచాలి. వృథాకు వీలు లేకుండా ఆహార పదార్థాలను వివిధ రకాలుగా తయారు చేయాల్సి ఉంది. ఖరీదైన పదార్థాలను మెనూ నుంచి తొలగించాలి. వేపుళ్ల కన్నా ఆవిరి సాయంతో వండే పదార్థాలపై దృష్టి సారించాలి. ఫలితంగా వంట నూనె వినియోగమూ తగ్గుతుంది."

- పీఎల్​ఏ డైలీ కథనం

ఆహార వృథాను అరికట్టేందుకు చైనా కేంద్ర మిలిటరీ కమిషన్ (సీఎంసీ)లోని లాజిస్టిక్ విభాగం, పీఎల్​ఏ ఉన్నత అధికారులు ఇటీవల అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సైనికులు ఆహారాన్ని పొదుపు చేసేలా మార్గదర్శకాలు రూపొందించింది. ఉత్పత్తి నియంత్రణతోపాటు పర్యవేక్షణ, తనిఖీలను ముమ్మరం చేసింది.

ఏమిటీ క్లీన్​ ప్లేట్​..

ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు 'క్లీన్ యువర్​​ ప్లేట్'​ ఉద్యమాన్ని జిన్​పింగ్​ గతవారం ప్రారంభించారు. ఆహార వృథా సిగ్గుచేటని కఠిన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దానిని అమలు చేయడం మొదలుపెట్టారు. దీని కోసం ఎన్‌-1 విధానం కూడా మొదలుపెట్టారు. ఫుడ్‌ యూట్యూబర్లపైనా ఆంక్షలు విధించారు.

చైనాలో ఈ ఏడాది ఆహార కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే కారణంతోనే 'క్లీన్​ప్లేట్​' ఉద్యమానికి జిన్​పింగ్​ శ్రీకారం చుట్టారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చైనాను ముంచెత్తిన వరదలతోపాటు కరోనా నేపథ్యంలో ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గిపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

జిన్​పింగ్​కు ఇబ్బందే..

అయితే సైన్యంలోనూ దీన్ని కఠినంగా అమలు చేయటం జిన్​పింగ్​కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. 2049 నాటికి ప్రపంచంలో బలమైన సైన్యంగా పీఎల్​ఏను చూడాలనుకున్న జిన్​పింగ్​ కలకు ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

(రచయిత- సంజీవ్ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.