తాలిబన్ల మితిమీరిన జోక్యం కారణంగా గురువారం నుంచి అఫ్గాన్ రాజధాని (pakistan airline suspends to afghan) కాబుల్‌కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) ప్రకటించింది. టికెట్ల ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో సేవలను నిలిపివేస్తామని తాలిబన్లు (talibans news) ఇటీవల పీఐఏతోపాటు స్థానిక విమానయాన సంస్థ 'కామ్ ఎయిర్'ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పీఐఏలో కాబుల్ నుంచి ఇస్లామాబాద్‌కు టికెట్ ధర 2500 డాలర్ల వరకు ఉంటోంది. అంతకుముందు కేవలం 120- 150 డాలర్ల మధ్యే ఉండేది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమైన తర్వాత ఇక్కడి నుంచి రెగ్యులర్‌గా సర్వీసులు నడుపుతున్న ఏకైక అంతర్జాతీయ విమాన సంస్థ ఇదే.
'సిబ్బందిని భయపెడుతున్నారు..'
ప్రస్తుతం పీఐఏ.. కాబుల్‌కు ఛార్టర్డ్ విమానాలు నడుపుతోంది. తాజాగా సర్వీసుల నిలిపివేతపై స్పందిస్తూ.. 'మానవతా దృక్పథంతో అఫ్గాన్‌కు విమానాలు నడుపుతున్నాం. బీమా సంస్థలు కాబుల్‌ను (taliban airlines) యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున.. బీమా ప్రీమియం ధరలు భారీగా ఉన్నాయి. ఈ ప్రభావం టికెట్లపై పడుతోంది' అని వివరించింది. మరోవైపు, తాలిబన్లు సైతం చివరి నిమిషంలో ప్రయాణ నిబంధనలు మార్చడం, అనుమతులకు కొర్రీలు పెట్టడం, సిబ్బందిని భయపెట్టే విధంగా ప్రవర్తించడం చేస్తున్నారని ఆరోపించింది. 'కామ్ ఎయిర్' ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. భూ మార్గాల్లో దేశం దాటేందుకు ఇబ్బందుల కారణంగా అఫ్గాన్‌లో విమాన ప్రయాణానికి భారీ డిమాండ్ ఏర్పడింది. కాబుల్‌లోని ప్రధాన పాస్‌పోర్ట్ కార్యాలయానికి స్థానికులు పోటెత్తుతున్నారు.
ఇదీ చదవండి:బంగ్లాదేశ్‌లో ఆలయాలపై దాడులు- అల్లర్లలో నలుగురు మృతి