నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి భవితవ్యాన్ని తేల్చే అధికార కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం మరోమారు వాయిదా పడింది. ప్రధాని ఓలి, పార్టీ కో-చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరికొంత సమయాన్ని ఇవ్వాలని.. ఆదివారం ఉదయం జరిగిన అనధికారిక సమావేశంలో నిర్ణయించారు నేతలు.
స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా పడటం ఇది వరుసగా 7వ సారి. తాజాగా.. ఆదివారం మధ్యాహ్నం జరగాల్సిన ఈ భేటీ మంగళవారం ఉదయం 11గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.
ఇదీ చూడండి:- 'నన్ను పదవి నుంచి దించేందుకు భారత్ యత్నం'
భారత్‌తో విభేదాలతో...
ఇటీవలే భారత్‌లోని మూడు ప్రాంతాలను తమ భూభాగాలుగా చెప్పుకుంటూ.. ఓ మ్యాప్‌ను విడుదల చేసింది నేపాల్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అనంతరం ఆ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్లో ఆమోదింపజేసుకుంది. అప్పటి నుంచి నేపాల్ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. భారత్‌పై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు ఓలి. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి భారత్ కుట్ర పన్నుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయనకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఓలి- ప్రచండ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. భారత్‌తో ఉన్న సత్సంబంధాలను ఓలి నాశనం చేస్తున్నారని.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని ప్రచండ సహా పార్టీలోని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి:-