ETV Bharat / international

యుద్ధానికి సిద్ధం కండి: కిమ్ ఆదేశం

అమెరికాతో యుద్ధానికి ఉత్తర కొరియా సిద్ధమైందా? యుద్ధ సన్నద్ధతపై అధికారులకు కిమ్ జారీ చేసిన ఆదేశాల వెనుక ఆంతర్యం ఏంటి?

US- North Korea
అమెరికా- ఉత్తరకొరియా
author img

By

Published : Jul 30, 2021, 11:51 AM IST

విదేశీ శక్తుల కవ్వింపు చర్యలను ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసన్నద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. ఆగస్టులో దక్షిణ కొరియా-అమెరికా సైన్యాలు సంయుక్తంగా విన్యాసాలు చేపట్టనున్న తరుణంలో.. సైనికాధికారులతో సమావేశమై, ఈమేరకు దిశానిర్దేశం చేశారు.

ఇదే మొదటిసారి..

జులై 24-27 వరకు మిలిటరీ అధికారులతో చర్చించి, కార్యాచరణను సిద్ధం చేశారు కిమ్. ఉత్తర కొరియా సైనిక వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి ఇలాంటి సుదీర్ఘ సమావేశం జరగటం ఇదే మొదటిసారని కొరియా జాతీయ మీడియా సంస్థ కేసీఎన్​ఏ పేర్కొంది. ప్రధాన ప్రత్యర్థి శక్తులు కలిసి.. వారి యుద్ధ విన్యాసాలను, సైనిక సామర్థ్యాలను ప్రదర్శించాలని చూస్తున్నాయని.. అందుకు సైన్యం సన్నద్ధంగా ఉండాలని, బలగాల సామర్థ్యం పెంచాలని సూచించినట్లు వివరించింది.

మాటలు కలిపినా..

ఉత్తర కొరియా అధినేత కిమ్​.. ఇటీవల తమ చిరకాల ప్రత్యర్థి అయిన దక్షిణ కొరియాతో సత్సంబంధాలు ప్రారంభించారు. దీంతో కొరియన్​ ద్వీపకల్పంలో శాంతియుత వాతావరణాన్ని చూడనున్నామా? అని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

క్షిపణుల వర్షం తప్పదు..

అయితే మరికొంతమంది మాత్రం.. అమెరికా- దక్షిణ కొరియా యుద్ధవిన్యాసాలు ప్రారంభిస్తే.. కచ్చితంగా ఉత్తర కొరియా తమ ఉనికిని బలంగా చాటుతుందని.. క్షిపణి పరీక్షలను, ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించటం ఖాయమని అంచనా వేస్తున్నారు.

అణ్వాయుధాల కార్యకలాపాల వ్యవహారంలో ఉత్తరకొరియా, అమెరికా మధ్య చర్చలు రెండున్నరేళ్లుగా స్తంభించాయి. అణ్వాయుధాల కార్యకలాపాల్లో అమెరికా విధించిన ఆంక్షలను సడలించకుంటే.. యుద్ధసామగ్రిని పెంచుకుంటామని ఇదివరకే హెచ్చరించారు కిమ్.

ఇవీ చదవండి:

అమెరికాతో పోరుకు సై అంటున్న కిమ్​!

బైడెన్​కు కిమ్​ సర్కార్​ తీవ్ర హెచ్చరిక

దక్షిణ కొరియాపై కిమ్​ ప్రభుత్వం క్షిపణి దాడులు!

ముప్పు తలెత్తితే అణ్వస్త్రాల మోహరింపు:కిమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.