ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్‌పై రష్యాతో భారత్‌ చర్చలు! - భారత్ రష్యా చర్చలు

కరోనా వ్యాక్సిన్​ ఫేజ్​-1,2 క్లినికల్​ ట్రయల్స్​కు సంబంధించి రష్యాను భారత్ సాంకేతిక సమాచారం కోరినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్​ దేశీయ ఉత్పత్తి, ఎగుమతికి కూడా అనుమతి కోరినట్లు రష్యా మీడియా స్పుత్నిక్ పేర్కొంది. 'స్పుత్నిక్​-వీ' టీకాపైనా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

VACCINE INDIA RUSSIA
కరోనా వ్యాక్సిన్‌
author img

By

Published : Aug 15, 2020, 5:55 PM IST

కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి మొట్టమొదటి టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు రష్యా ఇప్పటికే ప్రకటించింది. రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుని.. కీలకమైన మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెడుతోంది. ఫలితంగా ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఈ క్రమంలో భారత్‌కు చెందిన కంపెనీలు కూడా ఫేజ్‌-1, ఫేజ్-2 క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారం కోరినట్లు ఆ దేశ మీడియా స్పుత్నిక్‌ పేర్కొంది. వ్యాక్సిన్‌ దేశీయ ఉత్పత్తికి, ఎగుమతికి కూడా అనుమతి కోరినట్లు తెలిపింది. ఈ మేరకు రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌)తో చర్చించినట్లు పేర్కొంది.

"స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్‌-1, ఫేజ్‌-2 సాంకేతిక వివరాల కోసం ఆర్‌డీఐఎఫ్‌ను భారత కంపెనీలు అడిగాయి. అన్ని అనుమతులూ పూర్తి చేసుకున్న అనంతరం దేశీయంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, ఎగుమతి చేసేందుకు అనుమతి కోరినట్లు మాస్కోలోని రాయబార వర్గాలు తెలపాయి." అని స్పుత్నిక్‌ వెల్లడించింది.

రష్యా టీకాపై..

మరోవైపు మాస్కోలోని భారత రాయబారి వెంకటేశ్‌ వర్మ 'స్పుత్నిక్‌-వి'పై ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్‌తో చర్చించారు. కొవిడ్‌-19 పై వ్యాక్సిన్‌ ఉత్పత్తి విషయంలో పరస్పర సహకారం విషయంలో చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

చర్చలు ఫలప్రదంగా జరిగాయని, సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వెంకటేశ్‌ వర్మ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని దిమిత్రియేవ్‌ తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.