ETV Bharat / international

5 మిత్ర దేశాలకు భారత్​ వైద్య సహాయం

author img

By

Published : May 10, 2020, 2:58 PM IST

130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్​.. వైరస్​ను కట్టడి చేయటంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవటమే కాదు.. హైడ్రాక్సీక్లోరోక్విన్​ వంటి ఔషధాలను అందించింది. ఇప్పుడు మరో 5 మిత్ర దేశాలకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలు సహా వైద్య బృందాలను పంపి తన ఉదారతను చాటుకుంది. మిషన్​ సాగర్​లో భాగంగా ఈ మేరకు సాయం చేసినట్లు అధికారులు తెలిపారు.

five friendly nations
ఆ 5 మిత్ర దేశాలకు భారత్​ వైద్య సహాయం

ఓ వైపు కరోనా మహమ్మారిని కట్టడి చేస్తూనే ఇతర దేశాలకు సాయం చేస్తోంది భారత్​. ఇప్పటికే పలు దేశాలకు మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్​ అందించింది. ఇప్పడు మిత్రదేశాలైన మాల్దీవులు, మారిషస్​, మడగాస్కర్​, కొమొరోస్​, సీషెల్స్​ కు అవసరమైన మందులు, ఆహార పదార్థాలు సహా వైద్య బృందాలను పంపించింది.

ఆయా దేశాల వినతి మేరకు భారత నేవీకి చెందిన కేసరి నౌకను వైద్య సహాయం కోసం పంపించినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మిత్ర దేశాల సహాయం అందించేందుకు చేపట్టిన 'మిషన్ సాగర్'​ కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

" కొవిడ్​-19 మహమ్మారిపై పోరులో సహాయం చేయాలని వారు చేసిన వినతి మేరకు.. భారత్​ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నౌకాదళ షిప్​ కేసరిలో 5 దేశాలకు రెండు వైద్య సహాయ బృందాలు, కరోనా సంబంధిత ఔషధాలు, అసరమైన ఆహార పదార్థాలను పంపడం జరిగింది. మారిషస్​, మడగాస్కర్​, కొమొరోస్​, సీషెల్స్​కు ఔషధాలు, మాల్దీవులకు 600 టన్నుల ఆహార పదార్థాలను పంపింది."

- విదేశాంగ శాఖ

కొమొరోస్​కు పంపిన వైద్య బృందం కరోనాతో పాటు డెంగ్యూ జ్వరంపై పోరాడేందుకు అక్కడి ప్రభుత్వానికి సాయపడనుందని తెలిపింది విదేశాంగ శాఖ. మారిషస్​కు పంపిన వాటిలో ప్రత్యేకంగా ఆయుర్వేద ఔషధాలు, కొమొరోస్​కు పంపిన వాటిలో హైడ్రాక్సీక్లోరోక్విన్​ ఉన్నట్లు స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.