temple vandalised in pakistan: పాకిస్థాన్‌లో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. కరాచీ నగరంలోని రాన్చోర్ లైన్ ప్రాంతంలో ఉన్న అమ్మవారి ఆలయంపై ఓ వ్యక్తి దాడి చేశాడు. జోగ్మాయ మాత విగ్రహాన్ని సుత్తితో పగలగొట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. అనంతరం నిందితుడిని పట్టుకున్న ప్రజలు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి దైవదూషణకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
భారతీయ జనతా పార్టీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా ఈ దాడిని ఖండించారు. ఈ దాడి మైనారిటీలకు వ్యతిరేకంగా జరిగిందని ఆరోపించారు. ఇది ప్రభుత్వం మద్దతుతో కూడిన ఉగ్రవాదంగా అభివర్ణించారు.
అక్టోబర్‌లో సింధ్ ప్రావిన్స్‌లోని హనుమాన్ దేవి మాత మందిరాన్ని కొందరు గుర్తు తెలియని దొంగలు అపవిత్రం చేశారు. వేలాది రూపాయల విలువైన నగలను, డబ్బును దోచుకెళ్లారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లోని మైనారిటీల ప్రార్థనా మందిరాలపై దాడులు పెరిగాయి. దేశంలో ఉండే మైనారిటీల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని అంతర్జాతీయ సమాజం ఇప్పటికే పాక్‌ను చాలా సార్లు హెచ్చరించింది.
ఇదీ చూడండి: 'కమాండర్'కు స్వాగతం పలికిన జో బైడెన్ కుటుంబం