ETV Bharat / international

ఆహార పదార్థాలతో కరోనా ? చైనా సరికొత్త వాదన - సార్స్​-కొవ్​-2 వైరస్

మానవాళి జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్​ను గుర్తించి ఏడాది పూర్తయింది. వైరస్​ ప్రభావం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. విరుగుడు అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ వైరస్​ జనాలను ముప్పుతిప్పులు పెడుతూనే ఉంది. అంతలోనే కరోనాకు జన్మనిచ్చిన చైనా కొత్త వాదన అందుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఫ్రోజెన్​ ఫుడ్​ కరోనా వైరస్​ను మోసుకొస్తుందని వివాదానికి తెరతీసింది.

virus on frozen foods
ఆహార పదార్థాలతో కరోనా ? చైనా సరికొత్త వాదన..
author img

By

Published : Nov 25, 2020, 5:53 PM IST

కరోనా వైరస్​ పుట్టినిల్లు చైనా.. వైరస్​ వ్యాప్తికి సంబంధించి కొత్త వివాదానికి ఆజ్యం పోసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలపై వైరస్​ ఆనవాళ్లు కనిపిస్తున్నాయనేది తాజా వివాదం. ఈ నేపథ్యంలోనే చైనా.. ఈక్వెడార్​ సంస్థ నుంచి దిగుమతి చేసుకుంటున్న రొయ్యల దిగుమతిపై వారం పాటు నిషేధం విధించింది. మరిన్ని సంస్థలపైనా తాత్కాలిక ఆంక్షలకు పూనుకుంది.

China's claims of coronavirus
మాంసం దిగుమతిపై ఆంక్షలు

ఓవైపు పరిశోధకులు.. అట్టపెట్టెలు, ప్లాస్టిక్​ కంటైనర్లపై కొన్ని గంటల పాటు వైరస్​ ఉంటుందని చెబుతున్నా.. ఇది ఎంత ప్రమాదకరమైందన్న అంశంపై స్పష్టతనివ్వట్లేదు. మరోవైపు మహమ్మారికి సంబంధించిన ఇతర విషయాల్లానే ఈ అంశం కూడా రాజకీయ వస్తువుగా మారిపోతోంది.

దిగుమతుల నిషేధాల నేపథ్యంలో యూఎస్​ సహా ఇతర దేశాలు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం ప్రజారోగ్యమే తమకు అన్నింటికన్నా ముఖ్యమంటోంది. చైనా వాదనలు ఎలా ఉన్నా.. ఆహార ప్యాకేజీలపై ఉన్న వైరస్​ ప్రజలపై అంత ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం లేదంటున్నారు నిపుణులు.

అయితే, ఈ వివాదం అంతర్జాతీయంగా దుమారం రేపుతోంది.

China's claims of coronavirus
చైనా చర్యలపై దూమారం

చైనా కొత్త పాట..

మొట్టమొదటిసారి కరోనా వైరస్​.. చైనాలోని మాంసం మార్కెట్​లోనే వెలుగుచూసింది. వూహాన్​ వైరస్​ విధ్వంసం మరువకముందే.. జూన్​లోనూ మరోసారి బీజింగ్​ మాంసం మార్కెట్​లో వైరస్​ ప్రబలింది. ఈ నేపథ్యంలో మాంసం ద్వారానే కరోనా కాష్ఠం మొదలైందని అందరూ విశ్వసించటం మొదలుపెట్టారు. ఇది చైనా మాంసం విక్రయాలపై భారీగానే ప్రభావం చూపించింది. చైనా వివిధ రకాల మాంసాహార ఉత్పత్తులను దాదాపు 24 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం చాలా సూపర్​మార్కెట్లు దిగుమతైన మాంసంపై 'వైరస్​ ఫ్రీ' అనే స్టిక్కర్లు అంటిస్తున్నారు.

China's claims of coronavirus
ఆహార పదార్థాలతో కరోనా ?

ప్రస్తుత వాదనలో చైనా.. సరకు రవాణా చేసేవారిలో వ్యాధికారకాలు ఉండటం వల్లే ప్యాకేజింగ్​పై వైరస్​ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెబుతోంది. అయితే, ఈ మాంసం ప్యాకెట్లపై వైరస్​ ఎలా వచ్చిందనే అంశాన్ని అధికారికంగా తేల్చాల్సి ఉంది.

అంతర్జాతీయ ఆగ్రహం..

చైనా ఆగడాలపై ప్రపంచదేశాలు గుర్రుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చైనా నిషేధాలు బాట పడుతుండటం వివిధ దేశాలకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. యూఎస్​ సహా.. న్యూజిల్యాండ్, కెనడా, ఐరోపా దేశాలు చైనా విధానాలపై మండిపడుతున్నాయి. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఇంటువంటి చర్యలకు దిగటంపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి.​

చైనా నిషేధం.. ఎంతవరకు శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా ఉందో చెప్పాలని అమెరికా ప్రశ్నించింది. ఈ తరహా ఆంక్షలు స్వేచ్ఛా వాణిజ్యానికి అవరోధంగా మారతాయని హెచ్చరించింది. అయితే, చైనా.. అమెరికా​ వాదనలను తిప్పికొట్టింది.

China's claims of coronavirus
అమెరికా ఆగ్రహం

ప్రజల ఆరోగ్యమే అన్నింటికన్నా ముఖ్యమనే సూత్రానికి కట్టుబడి ఉన్నాం. వాణిజ్యం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేం.

-చైనా విదేశాంగ శాఖ

ఈ వివాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం స్పందించింది.

China's claims of coronavirus
ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఆహార ప్యాకేజీలపై వైరస్​ ఆనవాళ్లు కనిపించటం అరుదు. శీతలీకరణ పరిస్థితుల్లో వైరస్​ జీవించి ఉండే ఆస్కారముంది. అయితే, ఆహారం తీసుకోవటం ద్వారా కొవిడ్​-19 సోకిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు.

-ప్రపంచ ఆరోగ్య సంస్థ

వైరస్​ వ్యాప్తి..

మహమ్మారి సార్స్​-కోవ్​-2 ద్వారా వచ్చే కొవిడ్​-19 వ్యాప్తిపై అనుమానులున్నా.. కొన్ని నిర్దిష్టమైన మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లతో.. గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశాలున్నాయి. అందుకే మాస్కులు ధరించటం అత్యంత కీలకంగా మారింది.

China's claims of coronavirus
మాస్కులు తప్పనిసరి

అయితే, వైరస్ ఆనవాళ్లు కొన్నిసార్లు ఉపరితలాలపైనా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భౌతిక దూరం ఆవశ్యకత తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానూ వైరస్​ పరివర్తనం చెందుతుంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లో వైరస్​ వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలి. అందులో భాగంగానే కొవిడ్​ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తూ వైరస్​తో పోరాడుతున్నాయి ప్రపంచ దేశాలు.

నిపుణుల మాట..

చైనా సృష్టించిన కొత్త వివాదంపై భిన్నావాదనలు వినిపిస్తున్నాయి. ఆహార పొట్లాలపై వైరస్​ ఆనవాళ్లు ఉన్నాయన్న డ్రాగన్​ మాటే నిజమైతే.. ఆ ప్రభావమెంతన్నది తేలాల్సి ఉంది.

అత్యాధునిక పరీక్షల ద్వారానే ప్యాకేజీలపై ఉన్న వైరస్​లు యాక్టివ్​గా ఉన్నాయో.. లేదో గుర్తించగలం. వైరస్​ అవశేషాలను గుర్తిస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.

-వైరాలజిస్ట్​, సిడ్నీ, ఆస్ట్రేలియా

వైరస్​ ద్వారా కొద్ది మేరకు ప్రమాదం ఉండే అవకాశముందని మరికొంత మంది చెబుతున్నారు. అయితే, వ్యాపించే అవకాశాలు చాలా తక్కువంటున్నారు. గడ్డ కట్టిన పరిస్థితుల కారణంగానే వైరస్​ సజీవంగా ఉండే అవకాశాలు కొట్టిపారేయలేమని స్పష్టం చేస్తున్నారు.

ఈ వైరస్​ వ్యాపించేంత ప్రమాదకరమైంది కాదు. చైనా చెబుతోంది ఉపరితలంపై ఉన్న వైరస్​ ఆనవాళ్ల గురించి మాత్రమే.

-అండ్రూ పెకోజ్​, జాన్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం

China's claims of coronavirus
జాన్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం

ప్రమాదకర స్థాయిలో సార్స్​-కొవ్​-2 వైరస్​.. ఆహార పదార్థాలపై జీవించి ఉంటుందని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని జాన్​ హాప్కిన్స్​ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.