Dawood Ibrahim aide dies: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు, చోటా షకీల్ బృందంలో సభ్యుడు సలీం గాజీ మరణించాడు. పాకిస్థాన్ కరాచీలో గాజీ చనిపోయినట్లు ముంబయి పోలీసు వర్గాలు తెలిపాయి. గుండె సంబంధిత సమస్యలతో గాజీ మరణించినట్లు వెల్లడించాయి. అతను మధుమేహం, రక్తపోటు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాయి.
1993 Mumbai blasts accused
సలీం గాజీ.. 1993 ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు. ఆ ఏడాది మార్చి 12న దేశ ఆర్థిక రాజధానిలో జరిగిన పేలుళ్లలో 257 మంది మరణించారు. మరో 713 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల అనంతరం దావూద్ గ్యాంగ్‌తో కలిసి సలీం గాజీ.. పాకిస్థాన్‌కు పారిపోయాడు. దీంతో అతన్ని పట్టుకోవడంలో భారతీయ అధికారులు విఫమయ్యారు.
పేలుడు కుట్రదారుల్లో ఒకడైన టైగర్ మెమన్ సోదరుడు యూసఫ్ మెమన్ నాసిక్ రోడ్ సెంట్రల్ జైలులో గతేడాది మరణించాడు. మరో దోషి ముస్తఫా దోస్సా 2017లో మృతి చెందాడు.
ఇదీ చూడండి: ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేస్తే.. రూ.11 లక్షలు హాంఫట్!