చైనా, పాకిస్థాన్ మధ్య ఎనలేని స్నేహబంధం ఉన్న విషయం తెలిసిందే. పాక్ చేసే ఏ పనికైనా చైనా వత్తాసు పలుకుతుంది. బదులుగా చైనాకు వంతపాడుతుంది పాకిస్థాన్. అయితే చైనా దుర్బుద్ధి ముందు ఎలాంటి బంధమైనా బలహీనమైనదనే నిరూపితమైంది.
కరోనాను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌కు అన్ని రకాల సాయం అందిస్తామని చైనా తొలుత హామీ ఇచ్చింది. కరోనా టెస్టింగ్ కిట్లు, నాణ్యమైన ఎన్95 మాస్కులను ఎగుమతి చేస్తామని గొప్పగా ప్రకటించింది. అయితే చివరకు పాకిస్థాన్‌ను బురిడీ కొట్టించింది. నిస్సిగ్గుగా అండర్వేర్లతో తయారు చేసిన మాస్కులను పాక్‌కు ముట్టజెప్పింది.
ఈ విషయాన్ని పాకిస్థాన్ స్థానిక మీడియా సంస్థలు ధ్రువీకరించాయి. 'చైనా తమను మోసం చేసిందని' ఓ మీడియా సంస్థ ఆవేదన వ్యక్తంచేసింది. సింధ్ ప్రభుత్వం మాస్కులను తనిఖీ చేయకుండానే ఆస్పత్రులకు పంపించిందని పేర్కొంది.
-
China promised to send top quality N-95 masks to Pakistan. When the consignment landed, Pakistanis found that China had sent masks made of underwear.
— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) April 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Pakistani anchor says “China ne Choona laga diya”. #ChineseVirusCorona pic.twitter.com/3H4Uo151ZJ
">China promised to send top quality N-95 masks to Pakistan. When the consignment landed, Pakistanis found that China had sent masks made of underwear.
— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) April 4, 2020
Pakistani anchor says “China ne Choona laga diya”. #ChineseVirusCorona pic.twitter.com/3H4Uo151ZJChina promised to send top quality N-95 masks to Pakistan. When the consignment landed, Pakistanis found that China had sent masks made of underwear.
— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) April 4, 2020
Pakistani anchor says “China ne Choona laga diya”. #ChineseVirusCorona pic.twitter.com/3H4Uo151ZJ
"నాణ్యమైన ఎన్95 మాస్కుల పేరిట చైనా అండర్వేర్లతో తయారు చేసిన మాస్కులు పంపించింది. వైద్య సాయాన్ని పరిశీలించకుండా రాష్ట్ర అధికారులు అలసత్వం వహించారు. తనిఖీలు చేయకుండా మాస్కులను కరాచీలోని ఖతార్ ఆస్పత్రికి పంపించారు. అక్కడి వైద్యులు వీటిని చూసి చైనాను విమర్శించారు. పాకిస్థాన్‌ను చైనా బఫూన్‌ను చేసిందని వ్యాఖ్యానించారు."-లాహోర్ కేంద్రంగా పనిచేసే ఓ టీవీ ఛానెల్
గ్జింజియాంగ్ నుంచి సాయం
చైనా అధీనంలోని గ్జింజియాంగ్ ఉయ్ఘుర్ గవర్నర్ పాకిస్థాన్‌కు వైద్య సహాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ చైనా రాయబార కార్యాలయం, పాక్ విదేశాంగ శాఖకు లేఖ రాసినట్లు అక్కడి పత్రిక డాన్ పేర్కొంది. పత్రికలో వచ్చిన కథనం ప్రకారం 2 లక్షల సాధారణ మాస్కులు, 2 వేల ఎన్95 మాస్కులు, 5 వెంటిలేటర్లు, 2 వేల టెస్టింగ్ కిట్లు, 2 వేల వైద్యులు రక్షణ కోసం వినియోగించే దుస్తులను గ్జింజియాంగ్ గవర్నర్ పంపినట్లు తెలుస్తోంది.
ఈ దేశాల్లోనూ...
సాయం పేరిట నాణ్యత లేని వస్తువులు పంపించడం చైనాకు ఇది తొలిసారేం కాదు. ఇదివరకే పలు దేశాల్లోనూ చైనా నిర్వాకాలు బయటపడ్డాయి.
⦁ కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు కోసం ఓ చైనా సంస్థతో నేపాల్ ప్రభుత్వం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సరైన నాణ్యత లేని కారణంగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి.
⦁ చైనా నుంచి కొనుగోలు చేసిన లక్షలాది టెస్టింగ్ కిట్లను నాణ్యత లేమి కారణంగా స్పెయిన్ వెనక్కి పంపించింది.
⦁ చైనా పంపిన 1.5 లక్షల పోర్టబుల్, క్విక్ కరోనా టెస్టింగ్ కిట్లలో 80 శాతం నకిలీవేనని చెక్ రిపబ్లిక్ ప్రభుత్వం తేల్చింది. వీటిని ఉపయోగించి 10-15 నిమిషాల్లోనే కరోనా పరీక్షలు నిర్ధరించుకోవచ్చు. అయితే వీటి ఫలితాలు ఇతర పరీక్షల ఫలితాలతో పోలిస్తే కచ్చితత్వంలో తేడా ఉందని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: మోదీజీ... ఆ ఔషధాలు పంపండి ప్లీజ్: ట్రంప్