ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు - లక్ష మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్ పాజిటివ్​ కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్​, జర్మనీ, ఫ్రాన్స్​ సహా ఇతర దేశాల్లో ఈ మహమ్మారి కారణంగా వేలాది మంది మృత్యువాతపడగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,01,483కు చేరుకుంది. 16.75లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి.

Corona deaths over one lakh in across the globe
ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన కరోనా మరణాలు
author img

By

Published : Apr 10, 2020, 11:36 PM IST

Updated : Apr 11, 2020, 12:25 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్ పాజిటివ్​ కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్​, జర్మనీ, ఫ్రాన్స్​ సహా ఇతర దేశాల్లో ఈ మహమ్మారి కారణంగా వేలాది మంది మృత్యువాతపడగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,01,483కు చేరుకుంది. 16.75లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో అత్యధికం

వైరస్​ ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. అమెరికాలో అత్యధికంగా 4.88లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 20,414 మందికి పైగా వైరస్​ సోకగా.. 1,318 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అగ్రరాజ్యంలో మొత్తం మృతుల సంఖ్య 18,009కి చేరింది.

బ్రిటన్​లో రికార్డు స్థాయి మరణాలు

ఇటలీలోనూ మహమ్మారి మరణ మృదంగం ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇటలీలోనే ఇప్పటివరకు అత్యధికంగా 18,849 మంది కరోనాకు బలయ్యారు. గత 24 గంటల్లో 3,951 మందికి వైరస్​ సోకగా.. 570 మంది చనిపోయారు. మొత్తం 1,47, 577 మందికి వైరస్​ సోకింది. అటు స్పెయిన్​లో మొత్తం కేసుల సంఖ్య 1,57,053కు చేరుకుంది. తాజాగా కరోనా మరణాలు 523 సంభవించగా.. మొత్తం మృతుల సంఖ్య 15,970కు చేరింది. టర్కీలోనూ మృతుల సంఖ్య 1000 దాటింది.

ఇవాళ ఒక్కరోజే ఫ్రాన్స్​లో 987, బ్రిటన్​-980, ఇటలీ-570, స్పెయిన్​-523, బెల్జియం-496, ఇరాన్-122, నెదర్లాండ్స్​లో 115 కరోనా మరణాలు సంభవించాయి.

Last Updated : Apr 11, 2020, 12:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.